విడాకులతో బాధపెట్టిన టాలీవుడ్ జంటలు …ఎవరో ఒక లుక్ వేద్దామా

తాము అభిమానించే సినీ సెలబ్రిటీ జంటలు పెళ్లితో ఒక్కటైతే ఫాన్స్ కి ఖుషీ ఎంతలా ఉంటుందో అలాగే విడిపోతే బాధ ఎక్కువగానే ఉంటుంది. బద్రీ సినిమాతో ఆడియన్స్ కి కనువిందు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ ల మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత జానీ మూవీ నాటికి పెళ్లివార్త చెప్పారు. అప్పట్లో టాలీవుడ్ లో ఈ వార్త సంచలనం అయింది. ఎందుకంటే అప్పటికే పెళ్లయి,విడాకులు తీసుకున్న పవన్ ప్రేమించి పెళ్లిచేసుకోవడం గ్రేట్ కదా. వీరికి అకిరా,ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఎందుకో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో ఫాన్స్ చాలా బాధపడ్డారు.

మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ , ప్రణతీ రెడ్డి2015లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే కొద్దీ కాలానికే విడిపోతూ బహిరంగంగా ప్రకటించారు కూడా. సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. బాలీవుడ్ స్టార్స్ మలైకా అరోరా,ఆర్భాస్ ఖాన్ లు టాలీవుడ్ లో కూడా పరిచయం ఉన్నవాళ్లే. వీళ్ళిద్దరూ పెళ్లయి బెస్ట్ కపుల్ అనిపించుకున్న ఈ జంట పెళ్లయి 18ఏళ్ళ తర్వాత విడిపోయారు. గబ్బర్ సింగ్ లో కెవ్వుకేక సాంగ్ తో అరోరా అలరిస్తే, అర్బాస్ ఖాన్ జై చిరంజీవ మూవీతో విలన్ పాత్ర వేసాడు. అయితే తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో అరోరా చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ పెళ్లికూడా చేసుకుంటారన్న వార్త చక్కర్లు కొడుతోంది.

ఒకప్పటి నేపాల్ పీఎం మనవరాలు , స్టార్ హీరోయిన్ మనిషా కొయిరాలా , నేపాల్ బిజినెస్ మ్యాన్ సమర్ధలాల్ జంట కూడా పెళ్లి చేసుకున్నాక విడిపోయారు. ఇది అప్పట్లో సంచలనం కల్గించింది. తమిళనాట ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి సత్తా చాటిన ఏ ఎల్ విజయ్,ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా రాణించిన అమలాపాల్ 2014లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే చూడముచ్చటగా ఉన్న ఈ జంట 2017లో విడిపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, బిజినెస్ మ్యాన్ అశ్విన్ రామ్ కుమార్ ల పెళ్లి 2010లో పెళ్లిచేసుకున్నారు. అయితే ఏడేళ్ల తర్వాత విడిపోతున్న వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది.

error: Content is protected !!