మన సెలబ్రిటీస్ లో ఎవరెవరికి కవలలు పుట్టారో తెలుసా ?
పిల్లలు పుట్టడం వేరు,అందునా కవలలు పుట్టడం వేరు. కేవలం ఐదు పది నిమిషాల తేడాతో అక్కా చెల్లెల్లు కానీ అన్నదమ్ములు గానీ, అక్కా తమ్ముడు కానీ, అన్న చెల్లి కానీ ఇలా కవలలు పుట్టడం కామన్. సాధారణ జనంలోనే కాకుండా సినిమా సెలబ్రిటీలకు కూడా కవలలు పుట్టిన ఘటనలు ఉన్నాయి. సెలబ్రిటీ లకు పుట్టే కవలలైతే వారి క్రేజ్ ఎక్కడికో వెళుతుంది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్, మన్యత దత్ దంపతులకు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ కవలలుగా పుట్టారు.
యాంకర్ ఉదయ భాను ముందుగా ఓ ముస్లిం యువకుడిని చేసుకుంది. ఎక్కువకాలం అది నిలవలేదు. ఇద్దరూ విడిపోవడంతో విజయవాడకు చెందిన విజయకుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. వీరికి కవల పిల్లలుగా అమ్మాయిలు జన్మించారు. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకు హీరో మంచు విష్ణు కి ఎపి సీఎం వైఎస్ జగన్ సోదరి వరుస అయిన వెరోనికను ప్రేమించి పెళ్లాడాడు. మొదటి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా పుట్టారు. బాలివుడ్ హీరోయిన్ సన్నీలియోన్ కి ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు.
దుబాయ్ లోని ఓ ఓపెనింగ్ లో ఓ వ్యక్తిని చూసిన సెలీనా, అతడిని ప్రేమించి పెళ్లిచేసుకోగా మగకవలలు జన్మించారు. బాలీవుడ్ డైరెక్టర్ సురేష్ కుందర్, కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ ని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఆడకవలలు జన్మించారు. అలాగే బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి కూడా ఒక పాప,ఒక బాబు కవలలుగా పుట్టారు. తమిళ నటుడు భరత్ దంపతులకు ఇద్దరు మగపిల్లలు కవలలుగా పుట్టారు. ఇక టివి యాక్టర్స్ సంతోషి,శ్రీకర్ లకు కూడా కవలలు పుట్టారు. సంతోషిణికి ముందుగా ఓ ముస్లిం యువకునితో పెళ్లయింది. అతడితో విడిపోయాక నటుడు శ్రీకర్ ని పెళ్ళిచేసుకుని, ఇద్దరు ఆడ కవలపిల్లలకు జన్మనిచ్చింది.