Movies

బాలయ్య గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా ? PART 2

సింహం పేరు కలిసొచ్చేలా ‘సింహం నవ్వింది, ‘బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా వంటి 8 చిత్రాల్లో బాలయ్య నటించాడు. ఇందులో సమరసింహారెడ్డి మూవీ అనే బాలయ్యకు ఎక్కువ ఇష్టం. 1987లో ఏకంగా 8 చిత్రాలు అంటే అపూర్వ సహోదరులు,భార్గవ రాముడు,రాము, అల్లరి కృష్ణయ్య,,సాహస సామ్రాట్,ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు చిత్రాలు విడుదలయ్యాయి. విజయశాంతితో అత్యధికంగా 17చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతిది తిరుగులేని జోడి అనిపించుకుంది. మొదటిసారి కథానాయకుడు సినిమాలో కలిసి నటించి, నిప్పురవ్వ తో ముగింపు పలికారు. ‘నరసింహానాయుడు, సింహా, లెజెండ్ చిత్రాలకు నంది అవార్డు అందుకున్నారు. సినిమాల్లో చేస్తూ హిందూపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బాలయ్య 25వ చిత్రం నిప్పులాంటి మనిషి ఎస్.బి.చక్రవర్తి డైరెక్ట్ చేసారు. 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’ ఏ. కోదండరామిరెడ్డి డైరెక్డ చేసారు. 75వ చిత్రం కృష్ణబాబు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది. 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ డైరెక్ట్ చేసారు. నిప్పులాంటి మనిషి, ప్రాణానికి ప్రాణం, అశోక చక్రవర్తి, యువరత్న రాణా, సుల్తాన్ చిత్రాల్లో డాన్‌ పాత్రలో నటించిన బాలయ్య బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో శ్రీరాముడిగా నటించాడు. తండ్రి జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో హీరోగా చేసి, తన తండ్రి బయోపిక్‌లో నటించిన ఏకైక హీరోగా బాలయ్య మరో రికార్డు నెలకొల్పాడు.

బాలకృష్ణ హీరోగా నటించిన 35 చిత్రాలకు డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా పరుచూరి బ్రదర్స్ కథా సహాకారం అందించారు. కాగా పైసావసూల్ సినిమా కోసం మొదటిసారి పాట పాడిన బాలకృష్ణ తెలుగులో తెరకెక్కిన తొలి టైమ్ మిషన్ నేపథ్య సినిమా ‘ఆదిత్య 369’ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో జీవించాడు. ఈమూవీకి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో నే ‘బైరవ ద్వీపం’ అనే జానసద చిత్రం లో బాలయ్య చేసాడు. బాలకృష్ణ డీమ్ ప్రాజెక్ట్‌లో ఆదిత్య 999 ఒకటి. త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయనున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందంటున్నాడు.