ఎన్టీఆర్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా ఏమిటో తెలుసా ?

తెలుగువారి పౌరుషాన్ని,ఆత్మాభిమానాన్ని చాటిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, మాజీ సీఎం నందమూరి తారకరామారావు మనవడిగా నందమూరి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే ఫాన్స్ లో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలరామాయణం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన తారక్ హీరోగా ఎంట్రీ ఇచ్చి,విభిన్న సినిమాలతో దూసుకెళ్తున్నాడు. యంగ్ టైగర్ అయ్యాడు.

కొందరు హీరోలు డైలాగ్ డెలివరీ బాగా చెప్తారు. డాన్స్ బాగా చేస్తే, మరికొందరు ఫైట్స్ బాగా చేస్తారు. మరికొందరు పాటలు కూడా పాడేస్తారు. కానీ ఇవన్నీ పుణికిపుచ్చుకున్న నటుడు తారక్ ఆల్ రౌండర్. డైలాగ్ డెలివరీలో,ఫైట్స్,డాన్స్,సాంగ్స్ ఇలా అన్నింటా ముద్ర వేసిన తారక్ తాతగారి పేరు పెట్టుకున్నందుకు అందుకు తగ్గట్టు తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీ రావు 2001లో తీసిన నిను చూడాలని మూవీ ద్వారా అతి చిన్న వయస్సులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అయితే తారక్ కి ఆ చిత్రం పెద్దగా విజయం చేకూర్చలేదు. అయితే ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో సూపర్ హిట్ కొట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సుబ్బు కూడా మ్యూజికల్ హిట్ అయింది. తర్వాత వి వి వినాయక్ డైరెక్షన్ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆది మూవీ తారక్ లోని నట విశ్వరూపాన్ని చూపించింది. తారక్ కి నాల్గవ మూవీ కాగా, వినాయక్ కి ఇది మొదటి చిత్రం. సరిగ్గా ఫ్యాక్షన్ డ్రాప్ లోనే మూవీస్ వస్తున్న సమయం కావడంతో వినాయక్ ఈ మూవీ తీసి భారీ హిట్ కొట్టాడు.

error: Content is protected !!