అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఎదో తెలుసా ?
టాలీవుడ్ స్టార్స్ తమ తమ రేంజ్ లో దూసుకెళ్తున్నారు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికి పరిమితమయి,ఇప్పుడిప్పుడే కొందరు షూటింగ్స్ కి వస్తున్నారు. అయితే స్టార్ హీరోలు మాత్రం ఇంకా ఇంటికే పరిమితం అయ్యారని టాక్. ఇక హీరోల సినిమాల్లో కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు ఉండడం సహజం. అలాగే గంగోత్రి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లువారబ్బాయి అర్జున్ తన టాలెంట్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు.
మెగా మేనల్లుడు అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక మలుపు తిప్పిన సినిమా ఏది అనగానే ఆర్య అని చెప్పొచ్చు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్టామినా ఏమిటో చూపించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో నడిచి మంచి విజయాన్ని నమోదు చేసుకుని సరికొత్త ట్రెండ్ గా నిల్చింది.
ఒక అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిని హీరో లవ్ చేస్తాడు. ఇలా ముగ్గురి మధ్య సంభాషణలు కొత్తగా ఉంటాయి. హీరోకి కామెడీ టచ్ తో ఇచ్చిన ఈ పాత్రను బన్నీ అదరగొట్టేసాడు. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న మూవీ ఇది. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్టర్ గా నిలబెట్టిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మించారు. మొత్తం మీద ఆర్య మూవీ అల్లు అర్జున్ ని స్టార్ హీరోగా నిలబెట్టింది.