తారక్ బరువు తగ్గడం వెనుక ఏం జరిగింది…కారణం ఎవరో తెలుసా?

బ్రహ్మర్షి విశ్వామిత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రతో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆతర్వాత బాల రామాయణం మూవీతో రాముడిగా నటించి ఆడియన్స్ కి చేరువయ్యాడు. ఇక పెద్దయ్యాక నిను చూడాలని మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్ ఆ తరవాత స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో తన సత్తా చాటాడు. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీ తారక్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఇక వరుసగా అది,సింహాద్రి వంటి విజయాలతో స్టార్ హీరో అయ్యాడు.

సింహాద్రి సినిమాలో లావుగా కనిపించిన తారక్ రాఖీ మూవీలో మరింత లావయ్యాడు. దాంతో ట్రోల్స్ పడ్డాయి. అదే సమయంలో యమదొంగ సినిమా తెరకెక్కించడానికి ఎస్ ఎస్ రాజమౌళి రెడీ అయ్యాడు. బరువు తగ్గాలని జక్కన్న సూచించడంతో తారక్ లైపో చికిత్స చేయించుకున్నాడు. దాంతో 30కిలోలు తగ్గాడు.

అయితే ఇలా చికిత్స చేయించుకోవడం లైఫ్ కి డేంజర్. వికటిస్తే ప్రాణాలే పోతాయి. అయినా ధైర్యంగా తారక్ చికిత్స చేయించుకుని అలా యమదొంగ సినిమాతో యంగ్ టైగర్ గా మారాడు. ఆతర్వాత సినిమాను బట్టి బరువు తగ్గడం,పెరగడం చేస్తూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్లిమ్ గా ఉన్నాడు. జక్కన్న తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ లో రామ్ చరణ్ తో కల్సి స్క్రీన్ షేర్ చేసుకుంటూ మల్టీస్టారర్ మూవీతో రాబోతున్నాడు.

error: Content is protected !!