ఎన్టీఆర్ కి విలన్ గా మంచువారబ్బాయి…అదిరింది కాంబినేషన్

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఎన్టీఆర్ కి ముప్పైవ సినిమా. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుందట. అందుకే త్రివిక్రమ్ మంచు మనోజ్ అయితే బాగుంటుందని ఎన్టీఆర్ చెప్పితే ఎన్టీఆర్ ఓకే అన్నాడట. అయితే ఇంకా మనోజ్ దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

error: Content is protected !!