Movies

ఛాన్స్ లు తగ్గటంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బ్రహ్మానందం…ఏమిటో చూడండి

అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా రోజులన్నీ ఒకేలా ఉండవు. ఒకప్పుడు మార్కెట్ బాగుంటే, ఎంత డిమాండ్ చేస్తే అంతగా ఇస్తారు. కానీ మార్కెట్ లో తేడా వస్తే, ఎంతిస్తే అంతటికే చేయాలి. సీన్ రివర్స్ అవ్వడం అంటే ఇదే మరి. ఇక ఒకప్పుడు తెలుగులో టాప్ కమెడియన్ గా దూకుపోయిన బ్రహ్మానందం ఇప్పుడు ఫేడవుటయ్యాడు. కామెడీ కింగ్ గా 20 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఈ హాస్యానందం కి రకరకాల కారణాల వలన ఈ మధ్య ఆఫర్స్ తగ్గిపోయాయి. జబర్దస్త్ ప్రోగ్రాం లో కామెడీ ఎప్పటికప్పుడు వచ్చేయడం, కొత్త కమెడియన్స్ రావడం.. పాత కమెడియన్స్ కొందరు చనిపోవడంతో బ్రహ్మికి తేడా కొట్టింది.

దాంతో బ్రహ్మానందానికి అవకాశాలు కూడా బాగా తగ్గిపోవడంతో పాటు గతేడాది హార్ట్ ఎటాక్ రావడం.. ఆపరేషన్ కూడా చేయించుకోవడంతో మునపటిలా జోరు లేకుండా పోయింది. ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై తన చిత్ర కళ చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. అదేమిటంటే, త్వరలోనే బుల్లితెరపై కూడా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బ్రహ్మీ కామెడీ షో పేరుతో ఓ రియాలిటీ షో చేసినా కూడా అది వర్కవుట్ కాలేదు.

అయితే ఇప్పుడు ఈయన మనసు సీరియల్స్ వైపు వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ ఛానెల్‌తో ఆయన ఒప్పందం కూడా చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. మా టీవీలో వచ్చే ఒక సీరియల్‌లో బ్రహ్మానందం నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది నిజమేనా అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు. అయితే గతంలో కూడా మా టీవీలోనే షో చేసాడు. అందుకే ఇప్పుడు కూడా సీరియల్స్‌లో నటిస్తున్నాడని టాక్. సీరియల్‌లో నటించడానికి ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని మార్పులు చేయాలని దర్శక నిర్మాతలకు బ్రహ్మానందం సూచించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. మరి బుల్లితెరపై ఎలా మెప్పిస్తాడా చూడాలి.