ఎన్టీఆర్ తో జోడి కట్టిన ఈ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

ఎన్నో ఆశలతో కొందరు సినిమా రంగంలో అడుగుపెడతారు. మరికొందరు అనుకొకుండా అడుగుపెడతారు. టాలెంట్ తో దూసుకుపోతారు. కొందరు తెరమరుగవుతారు. ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఇక తెలుగులో ప్రముఖ దర్శకుడు రుద్ర రాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన “సుబ్బు” చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా ముంబై బ్యూటీ సోనాలీ జోషి నటించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేయటంతో ఇప్పటి తరం సినీ ప్రేక్షకులకి ఈమె గురించి పెద్దగా తెలీదు.

అయితే తెలుగులో సోనాలి జోషి నటించిన సందడే సందడి, సుబ్బు, నాన్న నేను అబద్ధం వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే అలరించాయి. అయితే సడన్ గా ఏమైందో ఏమో గాని సోనాలి జోషి కొంతకాలం పాటు సినీ పరిశ్రమకు దూరమైంది. దీనికి పలు వ్యక్తిగత కారణాల ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎక్కువ గ్యాప్ తర్వాత మళ్లీ సినీ కెరీర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది.

అయితే ఇందుకోసం నటి సోనాలి చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడంలేదు తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటికే కొంతమంది సీనియర్ నటీనటులు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగానే సంపాదిస్తూ,.. పలు చిత్రాలలో అవకాశాలు కూడా దక్కించు కుంటున్నారు. అందుకే నటి సోనాలి జోషి కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ వెబ్ సీరీస్ తో మొదలు పెట్టబోతోందట. సినీ జీవితం పరంగా తన కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ కొంతమేర సందిగ్ధంలో పడినప్పటికీ ఛాన్స్ వస్తే దుమ్మురేపుతుందని అంటున్నారు.

error: Content is protected !!