ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా ….ఎక్కడకు వెళ్లిపోయిందో తెలుసా ?

కొందరు సడన్ గా వార్తలోకొస్తారు. సంచలనం సృష్టిస్తారు .. ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకుంటారు .. కానీ అంతేవేగంగా కనిపించకుండా పోతారు. అసలు ఎక్కడున్నారో ఎలా ఉంటున్నారో కూడా తెలియదు. సరిగ్గా ఈమె కూడా అంతే… గత ఏడాది మలయాళం భాషలో ప్రముఖ దర్శకుడు ఓమర్ లోలు దర్శకత్వం వహించిన “ఓరు ఆదార్ లవ్” అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ అనగానే ఆడియన్స్ కి ఠక్కున ఓ ఘటన గుర్తొస్తుంది.

ఇంతకీ ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ముందుగా ఈ చిత్రంలో ఈ అమ్మడు తన అందమైన కళ్ళతో కన్ను గీటే దృశ్యమే కళ్ళముందు కదలాడుతుంది. అయితేఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా నిలబడలేదు. అయినా సరే ,ఈ అమ్మడికి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో అప్పట్లో ఈ అమ్మడు ఓ ప్రముఖ సంస్థ యొక్క ఉత్పత్తులను తన సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రమోట్ చేసేందుకు దాదాపుగా పదిహేను లక్షల రూపాయలకు పైగా అందుకుందట.

ఇంతలా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమో అని నెటిజన్స్ చర్చిస్తున్నారు. ఎందుకో ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం తన తదుపరి చిత్రాల గురించి ఇలాంటి విషయాలను బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. అయితే తాజాగా ఈ అమ్మడుకి చేతిలో సినిమా ఆఫర్లు లేకపోవడంతో పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ హాట్ హాట్ ఫోటోలకి ఫోజులు ఇస్తోంది. అంతే గాక వాటిని సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచుతోంది.ప్రస్తుతం అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపు డెబ్భై లక్షలకి పైగా ఫాన్స్ అనుసరిస్తున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ చెప్పక్కర్లేదు.

error: Content is protected !!