సీమంతం సమయంలో గాజులు ఎందుకు తొడుగుతారు?

ఏ శుభకార్యములో చేయని విధంగా సీమంతం సమయములో గర్భిని స్త్రీకి అందరు గాజులు తొడుగుతారు. ఈ ఆచారం మన పూర్వీకుల నుండి వస్తుంది. ఇలా గాజులు తొడుగుతూ ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కనాలని ఆశీర్వాదం ఇస్తారు. అలా గాజులు తొడిగే కార్యక్రమంలో చక్కని పరమార్ధం కూడా ఉంది. గర్భం ధరించిన స్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.

అందుకే ఏడో నెలలో ఈ శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత గాజులు తొడుగుతారు . చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని నమ్మకం. మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారం వెనక ఒక పరమార్ధం ఉంటుంది.

error: Content is protected !!