జుట్టు రాలకుండా ఉసిరి ఎంత మాయ చేస్తుందో చూడండి

ఉసిరి అంటే మన అందరికి తెలుసు. ఉసిరికాయలు ఒకప్పుడు సీజన్ లో మాత్రమే దొరికేయి. కానీ ఇప్పుడు సంవత్సరం పొడవునా దొరుకుతున్నాయి. అలాగే ఉసిరి పొడి కూడా లభ్యం అవుతుంది. ఉసిరి జుట్టు సంరక్షణలో బాగా సహాయపడుతుంది. ఉసిరిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి నూనెలో కొన్ని ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి వేసి వేడి చేయండి. రెండు మూడు నిమిషాల తరువాత వెచ్చని నూనెని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒకటి లేదా రెండు గంటలు ఉంచి తల స్నానం చేయండి.

ఉసిరి జ్యూస్ మరియు నిమ్మరసంను కలిపి షాంపూలాగా ఉపయోగించవచ్చు.

రెండు టేబుల్ స్పూన్ యూకలిప్టస్ నూనెలోఉసిరి ముక్కలను రాత్రంతా నానబెట్టండి. ఒక మందపాటి పేస్ట్ సిద్ధం చేయడానికి గుడ్డు మరియు పెరుగును ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఈ పేస్ట్‌ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై బాగా పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి.

error: Content is protected !!