సమంత పుష్ప సినిమాను రిజెక్ట్ చేయటానికి కారణం ఎవరో తెలుసా ?
పెళ్ళికి ముందే కాదు,పెళ్లయ్యాక కూడా సినిమాల్లో దూసుకెళ్తూ,రెమ్యునరేషన్ కూడా ఎక్కువే ఛార్జి చేస్తున్న అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం కథల విషయంలో ఆచి తూచి సెలెక్ట్ చేస్తుంది. అందులో భాగంగా తమిళంలో విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సినిమా మాత్రమే ఓకే చేసిన సమంత తెలుగులో విక్రమ్ కుమార్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తోన్న థాంక్యూ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సీరీస్ సీజన్ 2లో కీలకపాత్రలో కూడా దర్శనమివ్వనుంది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు రిజెక్ట్ చేసిన ఒక సినిమా వ్యవహారం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సెన్సేషనల్ హిట్ కొట్టిన సంగతి తెల్సిందే. డైరక్టర్ సుకుమార్ డైరక్షన్లో వచ్చిన ఈ మూవీలో సమంత నటించింది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ పుష్ప మూవీ తీస్తున్నాడు. ఓ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేసున్న సినిమా పుష్ప కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. దీనికి తోడు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వరుసగా హిట్ సినిమాలతో అదరగొడుతోన్న కన్నడ భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అయితే సినిమా ముందు తెలుగులోనే విడుదల చేయాలని భావించిన చిత్రబృందం.. ఆ తర్వాత మార్కెట్ పరంగా కథలో కొన్ని మార్పులు చేసి నేషనల్ వైడ్ రిలీజ్ చేసేలా పాన్ ఇండియా మూవీగా డిసైడ్ అయ్యారు.
తాజాగా వస్తోన్న వార్త చూస్తుంటే, మొదట ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకున్నారట. ఎందుకంటే, సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో మెప్పించింది. అయితే పుష్ప సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర దాదాపు రామలక్ష్మి పాత్రకు దగ్గరగా ఉంటుందని సమంత ఈ సినిమాకు నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. అయితే పాత్ర ఒకేలా ఉన్నా సుకుమార్ టేకింగ్ వేరేలా ఉంటుంది కాబట్టి పుష్ప ఛాన్స్ సమంత ఓకే చేసి ఉంటే బాగుండేదని ఆమె ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే సమంత గత సంవత్సరం మజిలీ, ఓ బేబీ లాంటీ సినిమాలతో అదరగొట్టినప్పటికీ ఈ సంవత్సరం జాను సినిమాతో మాత్రం సమంతకు చేదు అనుభవం ఎదురైంది. అందుకే కథలు,పాత్రల ఎంపికలో కొంత కేర్ గా ఉంటోందట. అందుకే పుష్ప వదిలేసిందని టాక్.