Movies

అల్లు అర్జున్,ప్రభాస్ ఇద్దరిలో ఎవరు గ్రేట్…చూడండి

సినిమా స్టార్స్ ఫాన్స్ మధ్య పోటీ సహజమే. ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ ఫాన్స్ మధ్య మా హీరో గొప్పంటే,మా హీరో గొప్ప అని హంగామా చేసున్నారు. పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన ఈ హీరోల మధ్య సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మా హీరో సౌత్ ఇండియా స్టార్ అని ఫాన్స్ అంటుంటే, మా హీరో సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఫాలోవర్స్,లైక్ గల హీరో అని గొప్పలు చెబుతున్నారు.

అయితే ఈ హంగామా చూసిన మిగతా ఫాన్స్ కి నవ్వులాటగా ఉందట. ప్రభాస్ ఫేస్ బుక్ లో 14మిలియన్ మార్క్ చేరాడు. సౌత్ ఇండియాలో ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ గల ఏకైక హీరో ప్రభాస్. అందుకే బాహుబలి ఫాలోయింగ్ రేంజ్ మాములుగా లేదని ఫాన్స్ ప్రచారం సాగిస్తున్నారు.

ఇక బన్నీ కైతే 13మిలియన్స్ కి పైగా లైక్స్ ఉన్నాయి. దీంతో మోస్ట్ లైక్స్ సౌత్ స్టార్ హీరో బన్నీయే అంటూ ఫాన్స్ సందడి చేస్తున్నారు. సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియా పరంగా ఈ ఇద్దరు హీరోల ఫాన్స్ నడుమ గట్టి పోటీ నడవడం వింతగా ఉందని మిగిలినవాళ్లు నవ్వుకుంటున్నారు.