Health

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కారణంగా ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా ?

క‌రోనా కార‌ణంగా చాలా కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. దీంతో గంట‌ల త‌ర‌బ‌డి క‌ద‌ల‌కుండా ఒకే చోట కూర్చుని ప‌ని చేస్తున్నారు. పైగా పని అయిపోయేంత‌వ‌ర‌కు నోట్లో ఏదో ఒక‌టి వేసుకుని న‌ములుతూనే ఉంటారు. ఆఫీసులో ఉంటే క‌నీసం 5-10 నిమిషాలైనా అటూ ఇటూ న‌డుస్తూ స‌హోద్యోగుల‌తో మాట్లాడుతారు. కానీ ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా క‌ద‌ల‌‌ట్లేదు.ఈ విధంగా ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అవుతారు.

కంప్యూట‌ర్ విజ‌న్ సిండ్రోమ్‌
వెన్నెముక వంగిపోవ‌డం
రిపిటేటివ్ టైపింగ్ స్ట్రైన్‌
జుట్టు రాలిపోవడం
కంటి కింద మచ్చ‌లు (డార్క్ స‌ర్కిల్స్‌)
టెక్ నెక్‌ (మెడ‌పై అధిక‌భారం, వెన్ను నొప్పి)
ఇంక్రీజ్‌డ్ వ్రింకిల్స్‌ (చ‌ర్మంపై ముడ‌త‌లు)
ఊబ‌కాయం
చ‌ర్మం పొడిబారి, నిర్జీవంగా మార‌డం ( విట‌మిన్ డీ, డీ-12 లేక‌పోవ‌డం వ‌ల్ల‌)
తీవ్ర ఒత్తిడి

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకి 6 8 నుంచి గంటలు మాత్రమే పని చేయాలి. వర్క్ మధ్యలో లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. రోజులో కనీసం గంట ఫోన్స్ కి గుడ్ బై చెప్పేయండి. ఉదయం ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అలాగే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.