రాత్రి వేళ తలస్నానం చేస్తే..ఈ తప్పు అసలు చేయకండి

జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంది. జుట్టు సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం,జీవనశైలి, కాలుష్యం, పోష‌కాహార లోపం, జన్యుపరమైన సమస్యలు వంటి కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంది. కొంతమంది తలస్నానం రాత్రి సమయంలో చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

రాత్రి స‌మ‌యంలో తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది.త‌ద్వారా చుండ్రు, జుట్టురాలడం, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదుర వుతాయి.ఇవన్నీ జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. మైగ్రైన్ తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. .తడి జుట్టుతో పడుకున్నప్పుడు జుట్టు మొత్తం ముద్దలా తయారవుతుంది. దువ్వెనతో తల దువ్వినప్పుడు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

సైనస్ సమస్య ఉన్నవారు కూడా రాత్రి వేళ తలస్నానం చేస్తే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది.కాబ‌ట్టి, రాత్రి వేళ త‌ల‌స్నానం చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. అయితే తప్పనిసరి పరిస్థితిలో రాత్రి సమయంలో తల స్నానం చేస్తే కనుక జుట్టు బాగా ఆరబెట్టుకొని పడుకోవాలి.

error: Content is protected !!