టమోటా తింటే ఆ సమస్యలు వస్తాయట…నిజమేనా ?

ఎర్రగా,అందంగా ఉండే టమోటాలు అంటే అందరికి ఇష్టమే. టమోటాను ఏ కూరలో వేసిన కూరకు మంచి రుచి వస్తుంది. టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ట‌మాటాల్లో విటమిన్‌ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే క‌ళ్లు, చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.టమోటాను రెగ్యులర్ గాతీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకొనే వారికీ అద్భుతమైన కూర అని చెప్పవచ్చు. ఎందుకంటే టమోటా తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దాంతో బరువు తగ్గుతారు. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు టమోటాకి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే టమాటాల్లో ఆక్సలేట్ ఉంటుంది.ఇది మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు సహకరిస్తాయి.ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తినడం అంత మంచిది కాదు.అది ట‌మాటాల‌కు కూడా వ‌ర్తిస్తుంది.మితంగా ట‌మాటాల‌ను వాడితే.ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

error: Content is protected !!