Movies

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఓ చరిత్ర వుంది. అగ్రనటుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో విభిన్న పాత్రలు పోషించడమే కాకుండా స్టెప్స్ వేస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇక ఆయన వారసుడిగా 1986లో విక్రమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన తొలిసినిమాతో హిట్ కొట్టాడు. నాగార్జున తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుని కింగ్ గా నిలిచాడు. వందకు పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు,రివార్డులు తెచ్చుకుని,రికార్డ్స్ క్రియేట్ చేసాడు. తర్వాత కెప్టెన్ నాగార్జున డిజాస్టర్ అయింది. తర్వాత మజ్ను మంచి హిట్ ఇచ్చింది. సంకీర్తన ప్లాపయింది. అలా కెరీర్ మొదట్లో ఒక హిట్టు,ఒక ప్లాపుతో నెట్టుకొచ్చాడు.

ఇక 1987లో ఆఖరి పోరాటం సూపర్ హిట్ అయింది. వెంటనే జానకి రాముడు కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది. 1989లో 5సినిమాలు చేసి మంచి పేరుతెచ్చుకున్నారు. లవర్ బాయ్ గా అప్పటికే పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గీతాంజలి మూవీ మంచి హిట్. తర్వాత వచ్చిన శివ మూవీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. 1990లో 4సినిమాలు చేస్తే అన్నీ ప్లాపులుగా నిలిచాయి. అయితే హిందీలో తీసిన శివ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో పేరొచ్చింది. 1991లో 4సినిమాలు తీస్తే, అవీ ప్లాప్ అయ్యాయి. 1992లో 5సినిమాలు చేస్తే, హిందీలో ఖుదా గవా, తెలుగులో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం మూవీస్ హిట్ అయ్యాయి. 93లో కృష్ణతో కల్సి చేసిన వారసుడు హిట్. ఇక అల్లరి అల్లుడు ఇండస్ట్రీ హిట్.

1994లో మూడు సినిమాలు చేస్తే, హలొ బ్రదర్ సూపర్ హిట్ అయింది. తర్వాత ఏడాది 4సినిమాలు చేస్తే సిసింద్రీ హిట్ అయింది. 96లో 3సినిమాల్లో నిన్నే పెళ్లాడతా మూవీ సూపర్ హిట్. 97లో వచ్చిన అన్నమయ్య ఎప్పటికీ నిల్చె చిత్రంగా మిగిలింది. భక్తిరస హీరోగా మార్చేసింది. ఇక 98లో 5సినిమాలు, 99లో చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్ అయ్యాయి. 2000లో నువ్వొస్తావనీ,నిన్నే ప్రేమిస్తా మూవీస్ హిట్. తర్వాత ఏడాది 5మూవీస్ చేస్తే అన్నీ ప్లాప్. 2002లో మన్మధుడు బ్లాక్ బస్టర్. సంతోషం హిట్.

2003లో శివమణి హిట్. 2004లో నేనున్నాను,మాస్ మూవీస్ బ్లాక్ బస్టర్. తరవాత సూపర్ మూవీ బిలో ఏవరేజ్. 2006లో శ్రీరామదాసు హిట్. బాస్ ప్లాప్. 2007లో వచ్చిన డాన్ యావరేజ్. తర్వాత నాలుగేళ్లు కల్సి రాలేదు. 2012,-13కూడా అలాగే అయింది. 2014లో అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన మనం మూవీ హిట్. 2016లో సోగ్గాడే చిన్ని నాయన,ఊపిరి సినిమాలు హిట్. 2017లో హిట్ లేదు. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరోపక్క ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కూడా హిట్ కోసం చూస్తున్నారు.