కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క చెల్లి శ్రావ్య నటించటం లేదు….కారణాలు ఇవేనట

సినిమాలతో సమానంగా టివి సీరియల్స్ జనంలోకి దూసుకుపోయాయి. అందుకే ఫలానా టైం కి ఫలానా సీరియల్ వస్తుందని ఎదురుచూస్తుంటారు. ఇక బుల్లితెర సీరియల్స్ లో సూపర్ హిట్ గా కార్తీకదీపం సీరియల్ దూసుకుపోతోంది. ఆ సీరియల్ వచ్చే టైంలో పక్క ఛానల్ లో కొత్త సినిమాలు వస్తున్నా సరే, వాటిని పట్టించుకోనంతగా ఈ సీరియల్ లో ఆడియన్స్ నిమగ్నమయ్యారు. అయితే కార్తీకదీపం సీరియల్ లో లేటెస్ట్ గా శ్రావ్య పాత్రలో ఒక కొత్త నటి చేస్తున్నారు.

అయితే సీరియల్ లో భారీ మార్పును చూసి…కొంత మంది ఫేక్ న్యూస్ కూడా రాసారు. “ఆమెకు కరోనా సోకి ఉంటుందని…అందుకే ఆమెను సీరియల్ నుండి తీసేసారు” అనే పుకార్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కరోనా లాంటిది లేదని ఆమె బాగున్నారు అని క్లారిటీ ఇచ్చారు. మరి ఎందుకు ఆమె సీరియల్ లో కనిపించడం లేదంటే, క్లారిటీ లేదు. బిజీ షెడ్యూల్ వల్లే రావడం లేదా అనేమాట కూడా వినిపిస్తోంది.

మొత్తానికి సదరు పాత్రలో నీహారిక అనే కొత్త అమ్మాయిని కొనసాగిస్తున్నారు. మరి ఈమెను టెంపరరీగా శ్రావ్య పాత్రలో పెట్టారా? లేక పర్మినెంట్ గానా అనేది క్లారీటీ లేకపోవడంతో మొదటినుండి నటిస్తున్న శ్రావ్య ఉన్నట్టుండి ఎందుకు మారిపోయిందనే డౌట్ ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీరియల్ మొదటి నుంచి ఆదరిస్తున్న అభిమానులకు ఇది అంతుబట్టడం లేదు.

error: Content is protected !!