Movies

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా గురించి నమ్మలేని నిజాల… ఎన్ని కోట్ల లాభమో ?

ప్లాప్ డైరెక్టర్స్,హిట్స్ లేని వాళ్ళని,డైరెక్టర్ అవ్వాలనే కోరిక గల వాళ్ళని వెతికిపట్టుకుని సినిమాలు తీసి హిట్ కొట్టడంలో దిట్ట గా పేరొందిన ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు. ఈయన నిర్మించిన వర్షం మూవీలో ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తున్న ప్రభుదేవాను చూసి ఇతడికి డైరెక్టర్ గా ఛాన్సిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ప్రభు దేవాకు కూడా 8ఏళ్లుగా ఆ కోరిక ఉంది. ఇక ఎం ఎస్ రాజు అడిగిందే తడవుగా ఒకే చెప్పేసాడు. వర్షం రిలీజయ్యాక తన తర్వాత సినిమాకు ప్రభుదేవా డైరెక్టర్ అని ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఆస్థాన రైటర్ వీరు పోట్ల చెప్పిన లైన్ నచ్చడంతో కథ రెడీ చేయాలనీ ఎం ఎస్ రాజు చెప్పేసారు.

70రోజులు శ్రమించి వీరు పోట్ల కథ రెడీ చేసాడు. ఎం ఎస్ రాజు, ప్రభుదేవా, పరుచూరి బ్రదర్స్ కూడా కథలో కొంచెం సహకారం అందించారు. డైలాగ్స్ పరుచూరి బ్రదర్స్ అందించారు. ఎం ఎస్ రాజు స్క్రీన్ ప్లే అందించారు. హీరోయిన్ గా త్రిష ఒకే. హీరోగా ఉదయకిరణ్ ని అనుకున్నారు కానీ బాయ్స్ మూవీలో చేసిన సిద్ధార్ధ్ పేరు తెరమీదికి వచ్చింది. హీరోయిన్ అన్న క్యారెక్టర్ కి శ్రీహరి పేరు వీరుపోట్ల సూచించడం,అప్పటికే హీరోగా ప్లాప్ లు వస్తున్నందున కెరీర్ కోసం క్యారెక్టర్ యాక్టర్ గా ఒప్పేసుకున్నాడు. హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. 2014మే14న సినిమా లాంచ్. రెండున్నరకోట్ల బడ్జెట్ తో దసరాకు రిలీజ్ కి ప్లాన్ చేసారు. అరకు, అన్నపూర్ణ స్టూడియో,రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ చేసారు. 100రోజుల పనిదినాలతో షూటింగ్ పూర్తి. బడ్జెట్ నాలుగు కోట్లు దాటేసింది.

‘ఓ ప్రేమ’అనే టైటిల్ అనుకున్నారు. కానీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే టైటిల్ ఎం ఎస్ రాజు సూచించడంతో ఒకే అయింది. 2005జనవరి 14న 90ప్రింట్లతో రిలీజయింది. అదేరోజు తారక్ నా అల్లుడు మూవీ భారీగా రిలీజవ్వడంతో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీకి ఓపెనింగ్ అంతగా లేదు. అయితే అన్నిచోట్లా సూపర్ టాక్ తో బ్లాక్ బస్టర్ అయింది. స్వచ్ఛమైన ప్రేమ, అన్నాచెల్లెళ్ల బంధం అన్నీ కూడా అందంగా అమరాయి. సిద్దార్ద్ కిది తెలుగులో మొదటి మూవీ పైగా భారీ హిట్. స్క్రిప్ట్ పదిసార్లు చదివాక అన్ని పాటలూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసారు. వాటికి అద్భుత బాణీలు దేవిశ్రీ కట్టాడు. 35కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించి 24కోట్ల గ్రాస్, 16కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, 2005లో టాప్ 5మూవీగా నిల్చింది. సంక్రాంతి,బన్నీ మూవీ వలన కొంత రన్ లో తేడా కనిపించింది.