Movies

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి ఎన్ని కోట్ల వచ్చిందో…నమ్మలేరు

ఆణిముత్యలాంటి డైలాగులతో నవ్వులు విరబూయించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అర్ధం,భావం తో పాటు కథకు తగ్గ పేరు పెట్టిన సినిమా ఇది. విక్టరీ వెంకటేష్,సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈమూవీలో అంజలి ,సమంత హీరోయిన్స్, జయసుధ,ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదతర తారాగణం. రేలంగి మావయ్య, పెద్దోడు,చిన్నోడు, సీత, గీత, గూడోరోడు,కొండలరావు ఇలా పేర్లన్నీ చూస్తే మన ఊళ్ళోనే,మన ఇంట్లోని పాత్రలే కనిపిస్తాయి. అంతలా కనెక్ట్ అయింది ఈ సినిమా. మన నిజ జీవితానికి దగ్గరగా ఉండే సినిమా.

ఒక మాటకు గల విలువ ఏమిటో ఈ సినిమా తెలియజేస్తుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా కు ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా, వినసొంపుగా పాటలను మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీజే మేయర్ అందించాడు. మణిశర్మ నేపధ్య సంగీతం అందంగా అమరింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి,అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం మన జీవితంలోని ఆరాటాలను,ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. అసలు మనిషి అంటేనే మంచోడు అని నమ్మే మధ్యతరగతి తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్,… నిరుద్యోగి అయినా తనకు నచ్చినట్టు ముక్కుసూటిగా ఉండే పెద్ద కొడుకుగా వెంకీ,… సరదా సరదాగా నేటితనం యువకుడిలా మహేష్,… తమ పాత్రల్లో జీవించారు.

ప్రతి ఇంట్లో ప్రేమ గా చూసే బామ్మ, ఆప్యాయతగల ఇల్లాలు,ప్రతి మధ్య తరగతి మధ్య కుటుంబాల్లో అన్నదమ్ముల సరదామాటలు,కోపాలు, అలకలు,ప్రేమలు అన్నీ ఈ మూవీలో కనిపిస్తాయి. అహం తో విడిపోయి మళ్ళీ నిజం తెలుసుకుని మళ్ళీ కలిసిపోయే ఫ్యామిలీలు ఇందులో కళ్ళకు కట్టినట్లుంటాయి. ద్వంద్వార్థ మాటలు, అనవసర సంభాషణలు ఎక్కడా ఉండవు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా సరే, అందాల ఆరోబోత లేకుండా, కట్టూ బొట్టూ అన్నీ సంప్రదాయంగా చూపించారు. పోరాటాలు,ఆహాకారాలు, విసుగు తెప్పించే మాటలు లేవు. వెకిలి హాస్యం మచ్చుకైనా కానరాదు. విలువలు,అనుబంధాలు,ప్రేమలు ఇలా ఎన్నో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. జీవితాల సారాంశమే సినిమా కథ అని నిరూపించిన సినిమా ఇది.