Beauty Tips

కొబ్బరి నూనె తో ఇలా చేస్తే మీ ముఖం మెరవడం ఖాయం

Coconut Oil Face Glow tips : మనలో చాలా మందికి కొబ్బరి నూనె అంటే తలకు రాసుకోవడం మాత్రమే తెలుసు. కొబ్బరినూనెలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా బ్యూటీ ప్రయోజనాలు. ఈరోజు కొబ్బరి నూనెతో ముఖాన్ని కాంతివంతంగా ఎలా మార్చుకోవచ్చు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.
cococnut Oil benefits in telugu
ఇప్పుడు మనం ఒక ప్యాక్ తయారు చేసుకుందాం. దీనికోసం మనకు కొబ్బరి నూనె, కాఫీ పౌడర్ అవసరమవుతాయి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె, అరస్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి. అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేస్తే చర్మం మీద ముడతలు అన్ని తొలగిపోతాయి.

ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే కాస్త శ్రద్ద, సమయాన్ని పెడితే ముఖ సంరక్షణకు పెద్దగా డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని కాంతివంతంగా తెల్లగా మెరిసేలా చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన చిట్కాలను ఫాలో అవ్వండి.