ప్రధాని మోడీ రోజూ తినే భోజనం ఖర్చు ఎంతో తెలుసా..?
పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలతో పోలిస్తే ధనికులు చేసే భోజనం ఖర్చు సహజంగా ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఇక దేశంలోని రాజకీయ నాయకులు కూడా ఇదే కోవ కిందకు వస్తారు. ఎందుకంటే వారు కూడా సెలబ్రిటీలే కదా. దీంతోపాటు పదవీ, హోదా ఉంటాయి. ఆ క్రమంలో అలాంటి నాయకులు రోజూ చేసే భోజనం ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది సరే.. మరి మన దేశ ప్రధాని మోడీ రోజూ చేసే భోజనం ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.4 లక్షలట.
ఏంటీ షాకయ్యారా..! అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ అలా అని చెప్పి ఓ కాంగ్రెస్ నాయకుడు ఆరోపణలు చేశారు. ఈ మధ్యే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు చెందిన యువనేత అల్పేశ్ ఠాకూర్ మోదీపై ఆరోపణలు చేశారు. ‘‘మన ప్రధాని మోదీ తినేది అలాంటి ఇలాంటి భోజనం కాదు.. తైవాన్ నుంచి తెప్పించే పుట్టగొడుగులు(మష్రూమ్స్) తింటారాయన! ఒక్కోటి రూ.80 వేలు ఖరీదైన మష్రూమ్స్ రోజుకు 5 తింటారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలన్నమాట! ఇక ప్రధానిగారే అంత తింటుంటే.. సాధారణ బీజేపీ కార్యకర్తలు ఎలా తింటారో ఊహించుకోవచ్చు’’ అని అల్పేశ్ అన్నారు.
అంతే కాదు.. అల్పేశ్ అంతటితో ఆగలేదు. ఇంకా అతను ఏమన్నాడంటే… ‘‘ఒకప్పుడు మోదీ.. నా మాదిరిగానే నల్లగా ఉండేవారు. కానీ ఇప్పుడాయన నిగనిగలాడే టమాటా పండులా తయారయ్యారు. మష్రూమ్స్ తినడం వల్లే ఆయన ఒంటికి రంగుపట్టింది. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన మష్రూమ్స్ తినడం మొదలుపెట్టారని తెలిసింది’’ అని అల్పేశ్ అన్నారు. దీంతో అల్పేశ్ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. చాలా మంది అల్పేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆయన వెంటనే మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అవున్లే.. అధికార, ప్రతిపక్షాలు అన్నాక ఆ మాత్రం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమే..! అవన్నీ విని మనం పిచ్చివాళ్లం అవుతాం.. అంతే..!