ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామీ దర్శనం కేవలం రెండు గంటలే….అందరికి షేర్ చేయండి

వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఆ స్వామిని దర్శించుకోవాలంటే దాదాపుగా పది గంటలకు పైనే క్యూలో నిల్చోవలసి ఉంది. సెలవుల రోజుల్లో అయితే భక్తుల బాధ వర్ణనాతీతం. సెలవు రోజుల్లో అయితే స్వామి దర్శనం కావాలంటే దాదాపుగా 20 గంటలు పడుతుంది. ఆ స్వామి వారి దర్శనం అయ్యాక పడిన బాధ అంతా మర్చిపోతాం. కానీ చిన్న పిల్లలతో అన్ని గంటలు క్యూలో ఉండటం కష్టమే. ఇలాంటి భక్తుల కష్టాలను తీర్చటానికి టీటీడీ వారు ఒక ప్లాన్ వేశారు. 
Lord Venkateswaraఈ ప్లాన్ ప్రకారం వెంకటేశ్వర స్వామి సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం రెండు గంటల్లోనే దర్శనం అయ్యిపోతుంది. ఈ కొత్త విధానంలో భాగంగా, తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా, భక్తులు తాము దర్శనానికి ఎప్పుడు వెళ్లాలన్న విషయాన్ని ముందే నమోదు చేయించుకోవాలి. రద్దీని బట్టి, దర్శన సమయం, టోకెన్ తీసుకునే సమయానికి కనీసం నాలుగు గంటల సమయం తరువాత ఉంటుంది. ఆ త‌ర్వాత భ‌క్తులు క్యూ కాంప్లెక్స్ లోప‌లికి చేరుకున్న వెంట‌నే కేవ‌లం రెండు గంట‌ల్లోనే ద‌ర్శ‌నం పూర్త‌వుతుంది. దీనికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకుని  వెళ్ళాలి. venkateswara swami darsanam