పవన్ మెడలో ఆ లాకెట్ మీద ఏముందో చూసారా?
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఆడియో విడుదల నిన్న రాత్రి చాలా వైభవంగా జరిగింది. పవన్ అభిమానుల కేరింతలు,ఉషారు పవన్ కి మరింత ఉషారుని ఇచ్చింది. ఈ ఆడియో సందర్భంగా చాలా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక ఫోటో మాత్రం మెగా అభిమానులనే కాకుండా నెటిజన్స్ ని కూడా బాగా ఆసక్తి రేకెత్తించింది. ఆ ఫొటోలో పవన్ మేడలో ఒక లాకెట్ కన్పించింది. ఆ లాకెట్ మీద ఆంజనేయస్వామి చిత్రం ఉంది. ఆంజనేయస్వామి మెగా ఫ్యామిలీకి ఆరాధ్య దైవం కాబట్టి అందులో ఎటువంటి లాజిక్ లేదు.
అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆ లాకెట్ మీద ఉన్న ఆంజనేయస్వామి చిత్రం రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల బ్యానర్ లోగో వలే ఉంది.ఈ లాకెట్ ఉన్న ఫోటోను చూసిన మెగా అభిమానులు మాత్రం బాగా ఖుషి అయ్యిపోయారు. ఈ లాకెట్ వేసుకోవటం ద్వారా మా అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు పవర్ స్టార్. అలాగే రామ్ చరణ్ బేనర్ కి హైప్ తీసుకువచ్చినట్టు కూడా అయింది.అంతేకాకుండా నిన్న అయన చేసిన ప్రసంగంలో అయన మనస్సులోని మాటలను చెప్పటం అందరిని ఆకట్టుకుంది. ఏది ఏమైనా పవన్ ఏమి చేసిన స్పెషలే.