అసలైన బంగారంతో తయారుచేసిన ఈ చీర ధర ఎంతో తెలుసా?

అనుష్క-విరాట్ కోహ్లీ రిసెప్షన్ ఢిల్లీలో వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీలతో పాటుగా అనేక మంది ప్రముఖులు హాజరు అయ్యారు. అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్ళిలో కోహ్లీ అనుష్క చేతికి తొడిగిన ఉంగరం గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ రిసెప్షన్ లో ఆమె ధరించిన చీర గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ధరించిన చీర అసలు సిసలైన బంగారంతో తయారుచేసింది. బనారసీ చీరను బంగారు జరీతో పాటుగా బంగారం కూడా వేసి తయారు చేయించారట.Virat Kohliఈ చీరను దాదాపు ఆరు నెలల పాటు కష్టపడి తయారుచేయించినట్లు బనారసీ చీరల బిజినెస్ మ్యాన్ మక్బూల్ హసన్ తెలిపారు. ఆ చీర ఖరీదు అయిదు లక్షల రూపాయల కంటే ఎక్కువే ఉంటుందని తెలిపారు. గతంలో అభిషేక్ బచ్చన్ షేర్వానీ, ఐశ్వర్య రాయ్ బనారసీ చీర కూడా వీరి కుటుంబమే తయారుచేయించిందట..! ఈ చీరను ‘సోనా రూపా బూటా’ బనారసీ చీర అని పిలుస్తారు. ఈ డిజైనర్ శారీని ఒక్కసారి మాత్రమే నేస్తారట..! మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అడిగినప్పటికీ దాన్ని తయారుచేసి ఇవ్వరాట.Virat Kohli And Anushka