విక్టరీ వెంకటేష్ ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడెవ‌రో గుర్తు పట్టారా?

విక్ట‌రీ వెంక‌టేష్ ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడు..టాలీవుడ్‌లో హీరో. రెండు ద‌శాబ్దాల నుంచీ సినీ పరిశ్రమలో ఉన్న‌ప్ప‌టికీ.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆయన కేరీర్‌లో కొట్టిన హిట్లు  మాత్రం నాలుగైదుకు మించ‌వు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు. అక్కినేని నాగేశ్వరరావు మనవుడు సుమంత్. 
అక్కినేని మనవుడు నాగార్జున మేనల్లుడుగా సినీ పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమకథ సినిమాను నాగార్జున సొంత బేనర్ లో నిర్మించాడు.Akkineni nageswara rao and sumanthఆ సినిమా పర్వాలేదని అనిపించింది. కానీ కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంగా సుమంత్ కాస్త వెనక పడ్డాడని చెప్పవచ్చు. కెరీర్ ఆలా ఆలా సాగుతున్న సమయంలో కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వారి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో విడిపోయారు. ఆ తరవాత కూడా సినిమాలు చేసిన ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వలన ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ మధ్య గోల్కొండ హైస్కూల్ తో హిట్ కొట్టాడు సుమంత్. మరల ఇప్పుడు `మ‌ళ్లీ రావా..` సినిమా సుమంత్‌కు కొత్త ఊపిరి పోసింది. ఇలాగే మంచి మంచి సినిమాలు సుమంత్ చేయాలనీ కోరుకుందాం. Akkineni nagarjuna and sumanth