హలో హీరోయిన్ “కళ్యాణి ప్రియదర్శన్” హీరోయిన్ కాక ముందు ఏం చేసిందంటే..?
అఖిల్ మొదటి సినిమా నిరాశ పరచినప్పటికీ రెండో సినిమా ‘హలో’ మంచి హిట్ ని ఇచ్చి ఇటు అఖిల్ ని అటు నాగార్జునకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కళ్యాణి కూడా ఒకప్పట్టి హీరోయిన్ లిజి కూతురు. అలాగే తండ్రి ప్రియదర్శన్ నటుడు మరియు దర్శకుడు. ‘హలో’ హిట్ కావటంతో ఇప్పుడు అందరి దృష్టి కళ్యాణి మీద పడింది. ఆమె సినిమాలో హీరోయిన్ గా చేయటానికి ముందు ఏమి చేసేదో వంటి విషయాల గురించి తెలుసుకుందాం. 1.కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ దర్శకుడు కావటంతో సినిమా వాతావరణంలోనే పెరిగింది. తల్లి ఒకప్పటి హీరోయిన్ లిజి.
2.లిజి ఆత్మబందువు,20వ శతాబ్దం వంటి సినిమాల ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె మరల నితిన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.
3.కళ్యాణి చదువు సింగపూర్,న్యూయార్క్ సిటిలలో జరిగింది. ఆమెకు సిద్దార్ధ్ ప్రియదర్శన్ అనే సోదరుడు ఉన్నాడు. 4.కళ్యాణి హీరోయిన్ గా అవ్వటానికి ముందు ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.
5.ఎక్కువ బరువు ఉండే కళ్యాణి హీరోయిన్ అవటానికి దాదాపుగా 25 కిలోల బరువు తగ్గింది.
6.హిందీలో ఆలియా భట్ ,దీపికా అంటే ఇష్టమట. మళయాళి నటుడు మోహన్ లాల్ నటన అంటే చాల పిచ్చట కళ్యాణికి. నజీరుద్దిన్ షా,మోహన్ లాల్ సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తుందట కళ్యాణి.
7.తల్లితో కలిసి నటించటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందట.