మొటిమల వెనక మిస్టరీని బయట పెట్టిన సాయి పల్లవి

యుక్త వయస్సులో చాలా మంది అమ్మాయిలకు ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. అవి కొంత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కానీ సాయి పల్లవి మాత్రం మోటిమలే ముఖానికి అందం అని అంటుంది. తనను చూసాక చాలా మంది అమ్మాయిలలో మొటిమల గురించి బాధ పోయిందని అంటుంది సాయి పల్లవి. ముందు నా ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత ఆ ఫీలింగ్ లేదు. నా మొదటి సినిమా ‘ప్రేమమ్’ లో మేకప్ లేకుండా మొటిమలు ఉన్న ముఖంతోనే నటించాను. అందరికి నచ్చింది. 
Sai Pallavi‘ప్రేమమ్’ లో నన్ను చూసిన చాలా మంది అమ్మాయిలు మిలా ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతామని చెప్పటం చాలా ఆనందం కలిగిందని చెప్పింది. అలాగే తనకు మొదటి సినిమా ‘ప్రేమమ్’ లో అవకాశం వచ్చిందో కూడా వివరించింది. డాన్స్ షో చేసాక మెడిసిన్ చదవటానికి జార్ఖండ్ వెళ్ళాను. ఆ తర్వాత మెడిసిన్ నాల్గొవ సంవత్సరంలో ఉండగా ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి డైరెక్టర్ ఆల్ఫాన్సో. అయన నేను ఒక ప్రేమ కథను సినిమాగా తీస్తున్నాను. దానిలో నీవు హీరోయిన్ గా నటించాలని అడిగారు. 
Sai Pallaviమొదట ఆ విషయాన్నీ నమ్మలేదు. ఆ తర్వాత అయన చెప్పిన విషయాలను ఓపికగా విన్నాక నమ్మాను. అయన తన వికీపిడియా పేజీ చెప్పి చూడమన్నారు. అది చూసాక అయన ఎంత పెద్ద డైరెక్టరో అర్ధం అయ్యి ఆయనకు సారీ చెప్పి సెలవుల్లో నటిస్తానని చెప్పను. ఆ సినిమా’ ప్రేమమ్’. ఆ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిన విషయమే.Sai Pallavi