Movies

“వీణా శ్రీవాణి” గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇవే..!

శ్రీవాణి వీణ మీద అనేక రకాల పాటలను వాయిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకొని వీణకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించటంలో సఫలం అయ్యారనే చెప్పాలి. శ్రీవాణి తన పేరు ముందు వీణను చేర్చుకొని వీణా శ్రీవాణిగా గుర్తింపు పొందారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 
Veena Srivani1.తూర్పు గోదావరి జిల్లా నందుంపూడిలో పుట్టిన శ్రీవాణి 7 వ సంవత్సరం నుండి సంగీతాన్ని నేర్చుకోవటం ప్రారంభించారు. 

2.ఆమె మూడో తరగతిలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా బండారులంకలో పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర వీణలో ఓనమాలు నేర్చుకున్నారు. అక్కడే ఆమెకు వీణ వాయించటంలో పునాది పడినట్టు చెప్పవచ్చు. 

3.సీతామహాలక్ష్మి గారి ప్రోత్సాహంతో శ్రీవాణి ఐదవ తరగతి నుంచి స్టేజ్ ప్రదర్శనలు ఇవ్వటం మొదలు పెట్టింది. ఒక వైపు చదువు మరొక వైపు వీణ ప్రదర్శనలు ఇస్తూ రెండింటిని బేలన్స్ చేయటంలో సక్సెస్ అయింది. 

4.ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా అయ్యగారి సత్యప్రసాద్ గారి దగ్గర సర్టిఫికేట్ కోర్సు చేసింది. ఆ బ్యాచ్ లో టాపర్ గా నిలిచింది. 

5.వడలి ఫణి నారాయణ గారి దగ్గర సంగీతంలో డిప్లొమా చేసింది. 

6.ఆమె చదువులో కూడా బాగా రాణించింది. ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. అయితే ఉద్యోగం చేస్తే ఎక్కడ వీణకు దూరం కావాల్సి వస్తుందో అని ఉద్యోగాన్ని వదులుకుంది. 

7.డిగ్రీలో ఉండగా పెళ్లి కావటంతో వీణ సాధనకు ఫుల్ స్టాప్ పడింది. Veena Srivani8.పెళ్లి తరవాత ఎనిమిది సంవత్సరాలకు పైగా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వర్క్ చేసింది. 

9.మాములుగా వీణ స్పీడ్ 120 ఉంటుంది. ఇదే చాలా కష్టం. అలాంటిది వీణ ను 130 స్పీడ్ లో వాయిస్తుంది శ్రీవాణి. 

10.ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత భర్త వేణుస్వామి ప్రోత్సాహంతో వీణ వాయించటం మొదలు పెట్టి పాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. Veena Srivani Husband11.వీణ పాటలు అంటే కీర్తనలు, కృతులు మాత్రమే కాదు. ఇప్పటి తరానికి తగ్గట్టుగా పాటలను వీణపై వాయించటంతో ఈ వీడియోలకు తెగ వ్యూవ్స్ వస్తున్నాయి.

12.శ్రీవాణి ప్రస్తుతం సినిమాలకు వీణ వాయిస్తుంది. అజ్ణాతవాసి ఆడియో లాంచ్ ఫంక్షన్ లో వీణా శ్రీవాణి తన ఫెర్మార్మెన్స్ తో అదరకొట్టటంతో ఒక సారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.Veena Srivani