హేమ భర్త గురించి తెలుసా?

టాలీవుడ్ లో నటి హేమ గురించి తెలియని వారు ఎవరు ఉండరని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆమె అంతలా ప్రేక్షకుల్లో స్థానాన్ని సంపాదించుకుంది. నటన విషయానికి వస్తే అక్క పాత్ర అయినా…. తల్లి పాత్ర అయినా…కామెడీ అయినా…ట్రెజిడి అయినా ఆమెకు ఆమె సాటి. ఇండస్ట్రీలో నటిగా ఒక పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో కామెడీ పాత్రలకు శ్రీలక్ష్మి అమ్మ అయితే హేమ అమ్మమ్మ అనిపించుకుంటుంది. 
ఒక నటిగా గృహిణిగా, పొలిటికల్ లీడర్ గా భాద్యతలను నిర్వహిస్తున్న హేమ పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలుసా?ఆమె గురించి చెప్పాలంటే చాంతాడంతా స్టోరీ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే హేమ సినీ కెరీర్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. హేమ ఒక తమిళ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.1989 లో ‘భలే దొంగ’ సినిమాతో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇక పర్సనల్ విషయానికి వస్తే హేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత 7 సంవత్సరాలు గ్యాప్ తీసుకోని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. సుమారుగా 400 సినిమాల్లో నటించిన హేమ సక్సెస్ వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా?ఆమె భర్త సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన కూడా చిత్ర పరిశ్రమలో కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. జాన్ S.D.లాల్ తనయుడు. హేమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు. హేమ తన భర్త సహకారంతోనే సక్సెస్ బాటలో పయనిస్తుంది.