చర్మం పగలకుండా మృదువుగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

చలికాలంలో చర్మం పగలటం సహజమే. చర్మం పగిలితే అసహ్యంగా ఉండటమే కాకుండా చాలా చికాకును కలిగిస్తుంది. ఈ సమస్య నుండి ఎలా బయట పడాలో అర్ధం కాకా చాల ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని ఆహారాలను తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారటమే కాక పగిలే సమస్య తగ్గుతుంది. ఇప్పడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం. విటమిన్ సమృద్ధిగా ఉండే ఆరెంజ్‌, నిమ్మ‌, గ్రేప్ ఫ్రూట్స్‌, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తీసుకోవాలి. వీటిలో ఉండే విట‌మిన్ సి ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి చ‌ర్మానికి హాని చేసే బాక్టీరియాను తొలగించి చర్మ పగుళ్ళను తగ్గిస్తుంది. బాదం పప్పు 
బాదం ప‌ప్పులో విట‌మిన్ ఇ స‌మృద్ధిగా సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. అలాగే సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల లోహిత కిర‌ణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. 
దానిమ్మ 
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన చ‌ర్మాన్ని నాశ‌నం చేసే బాక్టీరియాను చంపేస్తాయి. దాంతో చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. 

చేపలు 
చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మం పగలకుండా సంరక్షిస్తాయి. వారంలో రెండు సార్లు చేపలు తింటే మంచిది. 
అవిసె గింజలు 
అవిసె గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మం మిగలకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. డార్క్ చాకోలెట్ 
డార్క్ చాకొలేట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా పగలకుండా సంరక్షణ చేస్తుంది. 
ఆకుపచ్చని కూరలు 
ఆకుపచ్చని కూరల్లో బీటా కెరోటీన్‌, విట‌మిన్ ఎ, సి, ఇలు స‌మృద్ధిగా ఉండుట వలన చర్మానికి మేలు చేయటమే కాకుండా చర్మంపై ఏర్పడిన మచ్చలను కూడా తొలగిస్తుంది. 
టమోటా 
టమోటాలో లైకోపీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి చర్మాన్ని సంరక్షిస్తుంది. 
గ్రీన్ టీ 
రోజూ ఒక క‌ప్పు గ్రీన్ టీ తాగినా చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి.
క్యారెట్స్ 
క్యారెట్స్ లో బీటా కెరోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడటమే కాకుండా ఎండ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.