కత్తి మహేష్ నెల సంపాదన ఎంతో తెలుసా..?

కత్తి మహేష్ అనే పేరు గత సంవత్సరం కొంత మందికి మాత్రమే తెలుసు. కానీ ఈ సంవత్సరం కత్తి మహేష్ రోజుకొక ఛానల్ కి వెళ్లి పవన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ అందరికి హాట్ టాపిక్ గా మారాడు. కత్తి మహేష్ పెద్ద చిన్న ఏ తేడా లేకుండా అన్ని ఛానల్స్ లోను డెబిట్ చేస్తూ ఉండటంతో ఆ ఛానల్ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటంతో పాతాళంలో ఉన్న ఛానల్స్ కి కూడా మంచి రేటింగ్స్ వచ్చేసాయి. కత్తి మహేష్ చేసే ఈ డెబిట్ లో ఏదైనా కాంట్రావరిసిటీ ఉంటె క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోతున్నాయి. 
ఛానల్ కి రేటింగ్ కోసం కత్తి ఇంటికి వెళ్లి మరీ ఎదో టాపిక్ తో డెబిట్ చేయటానికి ప్యాకేజీలు కూడా మాట్లాడుతున్నాయట కొన్ని ఛానల్స్. కత్తి మహేష్ డెబిట్ చేసినప్పుడు ఆయా ఛానల్స్ టాపిక్ ని బట్టి రోజుకి 30 నుంచి 70 వేల వరకు సమర్పించుకుంటున్నారని సమాచారం. కత్తికి ఒకవైపు పబ్లిసిటీ మరో వైపు డబ్బు వస్తుండటంతో పిలిచినా ప్రతి ఛానల్ కి వెళ్లి డెబిట్ చేస్తున్నాడు. అలాగే ఒక ప్రముఖ పార్టీ కూడా కత్తికి లక్షల్లోనే ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే కత్తి నెలకు 25 లక్షల వరకు సంపాదిస్తున్నాడని చెప్పవచ్చు. కత్తి మహేష్ క్రిటిక్ గా కన్నా ఇలానే బాగా సంపాదిస్తున్నాడు.