‘జబర్దస్త్’ లో జబర్దస్త్ చేస్తున్న బేబీ ‘దీవెన’…తండ్రి ఎవరో తెలుసా?

గత కొన్ని సంవత్సరాలుగా, ఈటీవీ లో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం కు ఉన్న ఆదరణ లోక విదితమే. మొదట్లో వారానికి ఒకసారి గురువారం నాడు వచ్చే ఈ ప్రోగ్రాం కు లభించిన ఆదరణ చూసి, వారానికి రెండు సార్లు గా extra జబర్దస్త్ గా శుక్రవారం నాడు కూడా కొనసాగించారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ కు టీం లీడర్ల స్కిట్లు మాత్రమే కాదు, జడ్జి లు గా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా తో పాటు యాంకర్లు అనసూయ, రేష్మి లు కూడా కారణమే. టీం లీడర్లు, తో పాటు కంటెస్టెంట్స్ కూడా, తమదైన ప్రత్యేకత ను ప్రదర్శిస్తున్నారు.

ఇక ఇది చాలదన్నట్టు, ఇపుడో, బుల్లి తార తళుక్కున మెరుస్తూ, తనకోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులను సొంతం చేసుకుంది కూడా. ఆ బుల్లి, చిట్టి పాప పేరు ‘దీవెన’. రాకింగ్ రాకేష్ టీం లో ఉన్న ఈ పాప వచ్చీ రాని ముద్దు ముద్దు మాటలతో డైలాగులు చెబుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.ఈ బేబీ దీవెన కోసమే జబర్దస్త్ చూసేవాళ్ళు ఉన్నారు కూడా. రాకింగ్ రాకేష్ టీం లో స్కిట్ చేసేప్పుడు, తన వంతు వచ్చేప్పటికి డైలాగ్ చెబుతుందా, లేక మర్చిపోతుందా అని ప్రేక్షకులకు కలిగే అనుమానం పటాపంచలు చేస్తూ, వీక్షకులను, జడ్జీలను మాత్రమే కాక స్కిట్ లో తోటి కంటెస్టెంట్స్ ను కూడా అలరిస్తూ, తనదైన చమక్కును ప్రదర్శిస్తూ డైలాగ్ ను చెప్పేస్తుంది. జబర్దస్త్ కు కొత్త బూస్ట్ లభించింది ఈ బేబీ ‘దీవెన’ వలన.