కార్న్ పకోడీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం

ప్రతి రోజు సాయంత్రం అయిందంటే ఎదో ఒక స్నాక్ తయారుచేసుకోవాలి. ప్రతి రోజు ఒకే రకమైన స్నాక్స్ చేసుకుంటే బోర్ కొడుతోంది. అలాగే కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కేవలం పది నిమిషాల్లో తయారయ్యే కార్న్ పకోడీ తయారి విధానంను తెలుసుకుందాం. 

కావలసిన పదార్ధాలు 

స్వీట్ కార్న్:1 కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు:1స్పూన్ 
జీలకర్ర:1/2 స్పూన్ 
సెనగపిండి:4 స్పూన్ 
బియ్యం పిండి:3 స్పూన్ 
గరం మసాలా:1/2 స్పూన్ 
ఉల్లిపాయలు:1 ముక్క
పచ్చి మిరపకాయలు:రెండు
ఉప్పు:తగినంత
కరివేపాకు:1 రెమ్మ
పసుపు:చిటికెడు
నూనె:కావాల్సినంత(వేయించడానికి)

తయారు చేసే విధానం:
ఒక బౌల్ లో  స్వీట్ కార్న్ తో పాటు పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి  కొంచెం నీటిని పోసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగిన నూనెలో కొంచెం కొంచెంగా వేస్తూ (పకోడీ మాదిరిగా) గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. అంతే వేడివేడిగా కార్న్ పకోడీ రెడీ.