100 సినిమాలు పూర్తీ చేసిన టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ లో 100 సినిమాలు పూర్తీ చేసిన స్టార్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా? అలనాటి ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ వరకు తమ కెరీర్ లో 100 సినిమాలు పూర్తి చేసిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్స్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందటానికి చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుల అభిమానంతోనే వారు 100 సినిమాలను పూర్తీ చేయగలిగారు. ఇప్పుడు వారి గురించి వివరంగా తెలుసుకుందాం. 
మోహన్ బాబు 
మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందారు. హీరోగా,విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు అనేక కీలకమైన పాత్రలను పోషించి సుమారుగా 560 సినిమాలను చేసారు. 
సూపర్ స్టార్ కృష్ణ 
కృష్ణ తన కెరీర్ ని తానే బిల్డప్ చేసుకున్నారు. అయన కెరీర్ లో సుమారుగా 345 సినిమాలు చేసారు. 
నందమూరి తారక రామారావు 
ఎన్టీఆర్ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అయన నటించిన 303 సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధి చెందారు. 
అక్కినేని నాగేశ్వరరావు 
అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో మరుపురాని పాత్రలను వేశారు. అయన సుమారుగా 256 సినిమల్లో నటించారు. అయన చివరి సినిమా ‘మనం’. 
కృష్ణం రాజు 
రెబెల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు సుమారుగా 197 సినిమాల్లో నటించారు. అయన నటించిన భక్త కన్నప్ప సినిమా విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. 
చిరంజీవి 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలను పూర్తి చేసి 151 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్వతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి కథతో తన 151 వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
శ్రీకాంత్ 
శ్రీకాంత్ సుమారుగా 125 సినిమాలలో నటించాడు. హీరో,విలన్,క్యారక్టర్ ఆర్టిస్ట్ వంటి అనేక పాత్రలను పోషించాడు. 
శోభన్ బాబు 
శోభన్ బాబు సుమారుగా 120 సినిమాల్లో నటించాడు. మంచి ఫెమ్ ఉండగానే సినిమాల నుండి విరామం తీసుకున్నాడు. 
బాలకృష్ణ 
బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తో 100 వ సినిమాను ఘనంగా పూర్తీ చేసాడు. ఆ ఉత్సాహంతో 102 వ సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు. 
జగపతి బాబు 
జగపతి బాబు తన కెరీర్ లో 100 సినిమాలలో నటించాడు. హీరో,విలన్,క్యారక్టర్ ఆర్టిస్ట్ అన్ని రకాల పాత్రలను పోషించాడు. 
రాజేంద్ర ప్రసాద్ 
రాజేంద్ర ప్రసాద్ 150 సినిమాలను పూర్తీ చేసాడు. క్యారక్టర్ ఆర్టిస్ట్,హీరో గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. 
మురళి మోహన్ 
మురళి మోహన్ దాదాపుగా 350 సినిమాల్లో నటించారు. అయన ఎన్నో విజయవంతమైన సినిమాలను కూడా నిర్మించారు. ఇప్పటికి మంచి అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తున్నారు.