MCA సినిమాలో విలన్ గా చేసిన విజయ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
నేచురల్ స్టార్ నాని నటించే సినిమాల్లో దాదాపుగా అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. నాని తన పాత్రతో పాటు మిగతా పాత్రలు కూడా బలంగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని నాని నమ్ముతూ…అదే సూత్రాన్ని ఫాలో అవుతూ సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు. అందుకే తన సినిమాల్లో ప్రతి పాత్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు నాని. నాని,సాయి పల్లవి హీరో,హీరోయిన్స్ గా భూమిక ప్రధాన పాత్ర పోషించిన MCA సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే.
MCA సినిమాలో విలన్ గా విజయ్ వర్మ నటించాడు. సినిమా విజయంలో విజయ్ వర్మకు కూడా భాగం ఉందని చెప్పవచ్చు. MCA సినిమా విడుదల అయినా సమయంలో విజయ్ వర్మ అదరకొట్టాడనే వార్తలు జోరుగా విన్పించాయి.దాంతో అసలు ఈ విజయ్ వర్మ ఎవరనే ఆరాలు మొదలు అయ్యాయి. ఒక మార్వాడి కుటుంబంలో జన్మించిన విజయ్ వర్మ హైదరాబాద్ లోనే పెరిగాడు. పూణే ఇన్స్టిట్యూట్ లో నటనకు సంబంధించి కోర్స్ చేసాడు. ఆ తర్వాత ముంబైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసాడు.
విజయ్ వర్మకు సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక ఉండటంతో ఒక డ్రామా కంపెనీలో చేరి నాటకాలు వేయటం ప్రారంభించాడు. అయితే విజయ్ వర్మ సినిమాల్లోకి రావటం ఇంటిలోని వారికి ఇష్టం లేదు. దాంతో చాలా కాలం వరకు విజయ్ తో వారి కుటుంబసభ్యులు మాట్లాడలేదట.
చాలా కస్టపడి బాలీవుడ్ లో పాగా వేసేశాడు. బాలీవుడ్ లో చేసిన సినిమాలు హిట్ కావటంతో విజయ్ గురించి MCA నిర్మాతలకు తెలిసింది. దాంతో వెంటనే MCA నిర్మాతలు విలన్ గా ఫిక్స్ చేసేసారు. సినిమాలో విజయ్ నానితో పోటాపోటీగా నటించాడు. విజయ్ నటనకు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అయ్యిపోయారు.