‘జబర్దస్త్ ‘ ధనరాజ్ ఈ పరిస్థితికి రావటానికి కారణం….?

జబర్దస్త్ చూసే ప్రతి ఒక్కరికి ధనరాజ్ బాగా తెలుసు. సినిమాలు చేసిన ‘జబర్జస్ట్’ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ధనరాజ్ జబర్దస్త్ షో చేయటం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన జబర్దస్త్ ప్రారంభంలో ధనరాజ్ మంచి మంచి స్కిట్స్ చేసేవాడు. ధనరాజ్ చేసే స్కిట్స్ బాగా పేలటంతో సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అలాగే సంపాదన కూడా బాగానే ఉండేది. అతని టీమ్ నుండి ఎంతోమంది యువ కమెడియన్స్ ని తెలుగు బుల్లితెరకు పరిచయం చేసాడు. అలాగే వారు కూడా ఒక వైపు బుల్లితెర మరో వైపు సినిమాలు చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు. 
ధనరాజ్ మాత్రం సంపాదించిందంతా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. సక్సెస్ లో ఉన్నప్పుడు ధనరాజ్ వెంట తిరిగినవారు ఇప్పుడు ధనరాజ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. బిగ్ బాస్ షో లో ధనరాజ్ పార్టిసిపేట్ చేసినప్పుడు కొడుకు పుట్టాడు.

కొడుకు అన్నప్రాసన కూడా ఎటువంటి హడావిడి లేకుండా ఇంటిలోనే జరిపాడు. ధనరాజ్ తన సినిమాలలో జబర్దస్త్ నటులను పెట్టుకొని సినిమా సరిగా ఆడక వారికీ సరిగ్గా పారితోషికం ఇవ్వలేక ఎవరికీ ముఖం చూపించలేకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దీనిలో ఎంత నిజం ఉందొ తెలియదు. సినిమా మీద ఫ్యాషన్ తో సంపాదించిన డబ్బును పోగొట్టుకున్నాడనేది మాత్రం నిజం. ఇప్పటికైనా నిర్మాణ రంగం వైపుకు వెళ్లకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సరిపోతుందని సన్నిహితులు అంటున్నారు. మరి ధనరాజ్ ఏమి చేస్తాడో.