Ullasamga Utsahamga Hero Yasho Sagar Details

Yasho Sagar (kicked the bucket 25 December 2012) was an Indian performer. who is best known for his part in Ullasamga Utsahamga (2008) with Sneha Ullal, which turned into a film industry hit. he was the child of B.P. Somu. who is Kannada film maker and Telugu mother and cousin of Prajwal Devaraj. 

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో గుర్తు ఉన్నాడా… ఎలా చనిపోయాడో తెలుసా?

యశో సాగర్ కరుణాకర్ దర్శకత్వంలో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నాడు. దాంతో అందరు సూపర్ స్టార్ అవ్వటం ఖాయం అని అందరూ భావించారు. కామెడీతో పాటు సీరియస్ పాత్రలను కూడా అవలీలగా పోషించగలడు. యశో సాగర్ అసలు పేరు భరత్. యశోసాగర్ ప్రముఖ కన్నడ నిర్మాత బి.వి. సోము కుమారుడు. యశో సాగర్ బాల నటుడిగా కన్నడలో కొన్ని సినిమాలు చేసాడు. 

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో యశో సాగర్ స్నేహ ఉల్లాల్ తో జోడి కట్టాడు. కర్ణాటకలోని తమకూరు జిల్లా శిరా దగ్గర 2012 డిసెంబర్ 19న తెల్లవారుఝామున 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో యశోసాగర్ తో పాటు కారు డ్రైవర్ కూడా మృతి చెందాడు. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.హైదరాబాద్ కు వచ్చేందుకు విమానం మిస్ కావటంతో స్నేహితుడితో కలిసి యశో సాగర్ కారులో బయలుదేరాడు. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకోనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఒక సినిమా ఒప్పందం కోసం వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. యశో సాగర్ చనిపోవటంతో అప్పటికే కమిట్ అయినా సినిమా ‘మిస్టర్ ప్రేమికుడు’ ఆగిపోయింది. 
కారు ప్రమాదం సంభవించినప్పుడు కారులో డ్రైవర్ విశ్వనాథ్,డ్రైవర్ పక్కన యశో సాగర్,వెనక యశో సాగర్ స్నేహితుడు లోకేష్ ఉన్నారు. ఈ ప్రమాదంలో లోకేష్ కి తీవ్ర గాయాలు అవ్వగా, యశో సాగర్,డ్రైవర్ విశ్వనాథ్ చనిపోయారు.

TAGS : Ullasamga Utsahamga Hero,Sneha Ullal, Yasho Sagar,Tollywood,Tollywood Gossips,Kannada Hero,Accident.