‘తొలిప్రేమ’ ను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

హీరోయిన్ మెహ్రీన్ గుర్తు ఉందా…నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో అల్లరిపిల్లగా నటించి బాగా గుర్తింపు పొందటమే కాకుండా వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఆమెకు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మొదటి సినిమా. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజా ది గ్రేట్, మహానుభావుడు వంటి హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘జవాన్’ నిరాశ పరచింది.

అయితే ఆమె ఇటీవల ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. అది ఆమె బరువు కారణంగా. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి మొదటగా ఈ సినిమా కోసం మెహ్రీన్ ని సంప్రదించాడట. కానీ ఆమె కాస్త బొద్దుగా కనపడటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని సమాచారం. 
మెహ్రీన్ మొదటి నుంచి తన ఫిజిక్ మీద దృష్టి పెట్టలేదు. కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంలో లంగాఓణిలో మ్యానేజ్ చేసింది. కానీ రాజా ది గ్రేట్, మహానుభావుడు చిత్రాల్లో మెహ్రీన్ బొద్దుగా కనిపించిందని కామెంట్స్ వచ్చాయి. జవాన్ చిత్రంలో మెహ్రీన్ ఇంకాస్త బొద్దుగా మారినట్లు స్పష్టంగా కనిపించింది.

వరుసగా ఆఫర్ లు వస్తున్నా కూడా ఈ అమ్మడు ఫిజిక్ పై దృష్టి పెట్టకపోవడంతో తొలిప్రేమ అవకాశాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ‘తొలిప్రేమ’ హిట్ కావటంతో కాస్త జ్ఞానోదయం అయ్యి జిమ్ లో వర్క్ అవుట్స్ చేయటం ప్రారంభించినట్టు సమాచారం. అంతేకాక ఆమె లావు కారణంగా ఏ సినిమాని కూడా మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయింది మెహ్రీన్.