పవన్ పార్టీ ఆఫీస్ నెల ఖర్చు ఎంతో తెలుసా?

పవన్ కళ్యాణ్ ఏమి చేసిన సంచలనమే. అది సినిమా అయినా రాజకీయం అయినా అంతే. రాజకీయ ఉపన్యాసాలతో పవన్ కళ్యాణ్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. గత సంవత్సరం పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వటంతో పవన్ అభిమానులు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. అదే పవన్ కళ్యాణ్ విభజన హామీల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ ఫైటింగ్ కమిటీ కూడా సంచలనం సృష్టిస్తుంది. అసలు జనసేన పార్టీ కార్యాలయం ఎక్కడ ఉంది?

అసలు పార్టీ నడపటానికి ఎంత ఖర్చు అవుతుంది. వంటి విషయాలను తెలుసుకుందాం. జనసేన పార్టీ ఆఫీస్ జూబిలీ హిల్స్ లోని ఆంధ్ర బ్యాంకు కి దగ్గర్లో ఉంది. ఈ ఆఫీస్ లో సుమారుగా 10 నుంచి 12 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. ప్రతి రోజు ఏమి జరుగుతుందో రాజకీయ విశ్లేషణ చేసి పవన్ కి చెప్పుతూ ఉంటారు. ఇక్కడ పనిచేసే ఒక్కొక్కరికి 25 వేల దగ్గర నుంచి 1.5 లక్ష దాకా నెల జీతం ఉంటుందని అంచనా. అలాగే ప్రతి జిల్లాలో కీలక పార్టీ సభ్యులకు 25 వేల నుండి 35 వేల వరకు ఇస్తూ ఉంటారు. ఇలా అన్ని ఖర్చులను కలుపుకుంటే నెలకు సుమారుగా 28 లక్షల ఖర్చు అవుతుందని సమాచారం. పవన్ ఈ ఖర్చు అంతా తన సంపాదన నుండే ఖర్చు పెడుతున్నాడు. పవన్ ఒక సినిమా చేస్తే సుమారుగా 30 కోట్ల వరకు తీసుకుంటాడు. అంతేకాక వ్యవసాయం నుండి కూడా ఆదాయం వస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీ టీమ్ అంతా తెలుగుదేశం పార్టీ టీమ్ ని పోలి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆఫీస్ లో కూడా ఉద్యోగులు ఇలానే విశ్లేషణ చేసి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేస్తూ ఉంటారు. ప్రశాంత్ కిషోర్ వచ్చాక వైకాపా పార్టీలో కూడా ఇటువంటి టీమ్ ని ఏర్పాటు చేసారు.