నాగబాబు గురించి అసలు నిజాలు చెప్పిన గెటప్ శ్రీను

జబర్దస్త్ కార్యక్రమంలో వెరైటీ గెటప్స్ వేస్తూ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో గెటప్ శ్రీను తన జీవితం గురించి,తన కెరీర్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. చిన్నతనంలో చిరంజీవి ‘ఖైదీ’ సినిమా చూసి నటుడు అవ్వాలని అనుకున్నాను. 2004 లో హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలను మొదలు పెట్టాను. అవకాశాల కోసం చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. 
జబర్దస్త్ మాకు జీవితాన్ని ఇచ్చింది. అంతేకాక గుర్తింపు ఇవ్వటమే కాకుండా అనేక సినిమా అవకాశాలను ఇప్పించి మమ్మల్ని ఒక మంచి పొజిషన్ కి తీసుకువచ్చింది. నాగబాబు గారికి జీవితాంతం రుణబడి ఉంటాను. 
నా స్కిట్స్ చూపించి నాగబాబు గారు చిరంజీవి 150 వ సినిమాలో అవకాశం ఇప్పించారు. నేను ఖైదీ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యి సినీ పరిశ్రమకు వచ్చి ఖైదీ నెంబర్ 150 వ సినిమాలో నటించటం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. పరిశ్రమకు చాలా కష్టపడి వచ్చానని, పరిశ్రమలో పైకి ఎదగాలంటే చాలా కష్టపడాలని చెప్పుకొచ్చాడు.