శ్రీదేవి కోసం 1980లో ఒక అభిమాని ఎన్నిలక్షలు ఖర్చు పెట్టాడో తెలుస్తే షాక్ అవుతారు?

స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె ఏ హీరోతో నటించిన ఆమె ఆ హీరోకి సరైన జోడి అని అనిపించుకుంది. అప్పట్లో ఆమె అందం అంటే యూత్ కే కాకుండా సినిమా హీరోలకు కూడా చాలా క్రేజ్ ఉండేది. ఆమెకు పోటీగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చిన శ్రీదేవికి సాటి రాలేదు. ఆమె రెండు తరాల నటులతో నటించిందంటే ఆమె హవా ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
sridevi in padaharella vayasu
అటువంటి శ్రీదేవి ఆకస్మిక మరణం అందరిని కలిచి వేసింది. ఆమె మరణ వార్త విన్న తర్వాత ఆమె గురించి సినీ రంగంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని బాషల వారు వారి భావాలను చాలా బాధతో వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత,దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఆమె గురించి మాట్లాడుతూ…80 వ దశకంలో శ్రీదేవి అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేది. దానికి ఉదాహరణగా తమ్మారెడ్డి భరద్వాజ ఒక సంఘటన గురించి చెప్పారు.

నేను చదువు ముగించుకొని సినిమాల్లోకి అడుగు పెట్టిన తోలి రోజుల్లో దుబాయ్ నుంచి ఒక స్నేహితుడు ఫోన్ చేసి శ్రీదేవిని చూడటానికి రెండు లక్షల రూపాయిలను ఇస్తానని చెప్పాడు.

షూటింగ్ లో జస్ట్ చూపిస్తే చాలు. పరిచయం కూడా చేయవలసిన అవసరం లేదని అన్నాడు. ఆ రోజుల్లో రెండు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే. అలాంటిది శ్రీదేవిని చూడటానికి రెండు లక్షలు ఇస్తానని అంటే శ్రీదేవి క్రేజ్ యువతలో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.