అందం ఆరోగ్యం మీద అంతలా శ్రద్ధ తీసుకునే శ్రీదేవి ఎలాంటి ఆహార నియమాలు పాటించేదో తెలుసా?

యావత్ ఇండియాని ఒక ఊపు ఊపిన నటి ఎవరంటే టక్కున శ్రీదేవి అని చెప్పవచ్చు. ఆమె మూడు దశాబ్ధాల పాటు టాప్ హీరోయిన్ గా ఉండటమే కాకుండా రెండు తరాల నటులతో ఆడి పాడింది. ఆమె అందం,అభినయంతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె మరణం ఎందరో అభిమానులకు బాధను కలిగించింది. కోట్లాది మంది అభిమానులు, సినీ నటులు,ప్రముఖులు ఆమెకు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.

ఆమె ప్రమాదవశాత్తు మరణించింది కానీ ఆమె తీసుకొనే ఆహార పద్దతుల ద్వారా అయితే ఆమె నిండు నూరేళ్లు బ్రతికేది. ఎందుకంటే ఆమె ఆహారపు అలవాట్లు ఆ విధంగా ఉంటాయి. ఆమె ఆరోగ్యానికి,అందానికి ఏ రకమైన ఆహార నియమాలను పాటించిందో తెలుసా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగటం అలవాటు. ఆ తర్వాత కొన్ని ఆరోగ్యకరమైన మూలికలతో చేసిన టీ త్రాగుతుంది. ఆ తర్వాత వెజిటేబుల్ జ్యుస్ త్రాగుతుంది.
sridevi in padaharella vayasu
బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక కప్పు ఓట్స్,తేనే కలిపిన పాలు,కొన్ని పండ్లు ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ లో సలాడ్,నాన్ వెజ్ కర్రీలు కొంచెం ఉప్పుతో తీసుకుంటుంది.

ఇక రాత్రి డిన్నర్ సమయంలో రోటి,వెజిటేబుల్ కర్రీలు,పండ్లు తీసుకుంటుంది. ఈ విధంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా భోజన నియమాలు పాటిస్తుంది శ్రీదేవి. అలాగే ఆమె త్రాగే వాటర్ కూడా చాలా ఖరీదైనది.

శ్రీదేవి AVN కంపెనీ వాటర్ ని త్రాగుతుంది. AVN కంపెనీ వాటర్ బాటిల్ ఒక లీటర్ సుమారుగా 600 రూపాయిలు ఉంటుంది. అలాగే ఎక్కువగా శ్రీదేవి డార్క్ చాకోలెట్ తింటుంది.

ప్రతి రోజు యోగ,జిమ్,టెన్నిస్ ఆడటం వంటివి చేస్తుంది. తన అందానికి కారణం తాను ఎప్పుడు సంతోషంగా ఉండటమే అని శ్రీదేవి తరచూ చెప్పుతూ ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టే శ్రీదేవి 50 సంవత్సరాలు వచ్చినా కూడా చాలా అందంగా కనపడుతుంది.