హైపర్ ఆదిని ఫెవరెట్ హీరో అంటే ఎవరి పేరు చెప్పాడో తెలుసా?

హైపర్ ఆది అంటే జబర్దస్త్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆది జబర్దస్త్ లోకి మాములుగా వచ్చి తన టాలెంట్ తో చాలా తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నాడు. హైపర్ ఆది స్కిట్స్ లో ఎక్కువగా పంచ్ లు ఉంటాయి. ఆ పంచ్ లతోనే బాగా ఫెమస్ అయ్యాడు. హైపర్ ఆది స్కిట్స్ ని యూ ట్యూబ్ లో అప్లోడ్ చేస్తే లక్షల్లోనే వ్యూస్ వస్తాయి.

హైపర్ ఆది వచ్చాక మిగతా వారి స్కిట్స్ రేటింగ్స్ పడిపోయాయనే వార్తలు కూడా వచ్చాయి. హైపర్ ఆది సినిమాల్లో కూడా మంచి అవకాశాలను పొందుతున్నాడు.

ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో ఆది తన మనస్సులోని మాటలను చెప్పాడు. జబర్దస్త్ లో ఇంత ఫెమస్ కావటానికి నాగబాబు,రోజాల సపోర్ట్ కూడా ఒక కారణమని చెప్పాడు. స్కిట్ లో లోటుపాటులు ఉంటే చెప్పి ప్రోత్సహిస్తారని చెప్పాడు.

అలాగే మీ అభిమాన నటుడు ఎవరని అడిగితే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాడు. మీరు ఆర్టిస్ట్స్ మీద ఎక్కువగా స్కిట్స్ ఎందుకు చేయరని అడిగితే ఆర్టిస్ట్స్ కి అభిమాన సంఘాలు ఉంటాయి. నేను చేసే స్కిట్స్ లో ఏదైనా పొరపాటు చేస్తే వారు హార్ట్ అవుతారని చేయనని చెప్పాడు.