ప్రియ లైఫ్ స్ట‌యిల్ చూస్తే అవాక్క‌వుతాం

ఓవ‌ర్ నైట్ సోష‌ల్ మీడియా స్టార్ ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒకే ఒక్క వీడియోతో దేశ‌వ్యాప్తంగా సెల‌బ్రిటీ అయిపోయిన ప్రియా ప్ర‌కాశ్ కు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోనూ కొన్ని ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం నిర్వ‌హిస్తూ ప్రియ రెండు చేతులా సంపాదిస్తోందంటూ వార్త‌లొస్తున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తే..ఆమె లైఫ్ స్ట‌యిల్ స్టార్ హీరోయిన్ లా ఉంటుంద‌న్న భావ‌న క‌లుగుతుంది. ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్, ఖ‌రీదైన డ్రెస్ లు, ఫోన్లు..రెస్టారెంట్లు, డిన్న‌ర్లు..ఇలా సాగుతూఉంటుంది ఆమె లైఫ్ అనుకుంటాం. కానీ ఓ ఇంగ్లిష్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న లైఫ్ స్ట‌యిల్ వెల్ల‌డించింది.

ఒక్కసారి క‌న్నుకొట్టి కోట్లాదిమంది యువ‌కుల హృద‌యాలు కొల్ల‌గొట్టిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కు సొంతంగా ఓ ఫోన్ నంబ‌ర్ కూడా లేదంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఈ ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా అవ‌కాశాలు, త‌న తాజా సంపాద‌న, కాలేజ్ లైఫ్, త‌న ఇంటి ప‌ద్ధ‌తులు స‌హా అనేక విష‌యాల‌ను ప్రియా ప్ర‌కాశ్ పంచుకుంది.

అంద‌రు అమ్మాయిల్లానే కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాల‌ని ప్రియ అనుకునేది. కానీ ఆమె చ‌దివిన విమ‌లా కాలేజ్ లో నిబంధ‌న‌లు అత్యంత క‌ఠినంగా ఉండేవి. కాలేజ్ కు ప‌ద్ధ‌తిగా ఉండే దుస్తులు వేసుకునే వెళ్లాలి. మొబైల్స్ తీసుకెళ్ల‌కూడదు. ప్రియ ఇంట్లోనూ ప‌ద్ధ‌తులు ఇలాగే ఉంటాయి.

దేశం మొత్తం త‌న గురించి మాట్లాడుకుంటున్నా..ప్రియ ప్ర‌కాశ్ కు ఆ సంగ‌తి అంతబాగా తెలియ‌దు. ఎందుకంటే..ఆమె సొంతంగా ఒక ఫోన్ కూడా వాడ‌దు. ఆమె వ‌ద్ద ఫోన్ ఉంది కానీ..అందులో సిమ్ లేదు. అవ‌స‌ర‌మైతే త‌ల్లి ఫోన్ వాడుకుంటుంది. ఇంట్లో హాట్ స్పాట్ ఆన్ చేసి ఉంటేనే ఆమె ఫోన్ వాడుకోగ‌ల‌దు.

ఒరు అదార్ ల‌వ్ చిత్రంలోని త‌న పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయినప్పుడు ప్రియా ప్ర‌కాశ్ తండ్రికి వింత అనుభ‌వం ఎదుర‌యింది. ఆమె తండ్రి కొలీగ్ ఒక‌రు ప్రియ వీడియోను వాట్సప్ చేసి..వీడియోలో ఉన్న అమ్మాయి ఎవ‌రో తెలుసా అని అడిగారు. దానికి ప్రియ‌ప్ర‌కాశ్ తండ్రి.. ఆ అమ్మాయి త‌న కూతురే అని బ‌దులివ్వ‌గా..ఆయ‌న కొలీగ్ కు నోట‌మాట రాలేదు.

ఆమెకు గుర్తింపు రాకముందు ఏ ఈవెంట్ కు ఐనా వెళ్లాలంటే త‌ల్లినో, ఆంటీనో వెంట‌తీసుకెళ్లేది. ఇప్పుడు మాత్రం మేనేజ‌ర్ ను నియ‌మించుకుంది. ప్రింగిల్స్, వ‌న్ ప్ల‌స్, హిప్ స్ట‌ర్ వంటి బ్రాండ్ల‌కు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టే ప్రియ‌..ఒక్కో పోస్ట్ కు రూ. 5ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. అన్నింటిక‌న్నా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మ‌రో విష‌యం ఉంది.

మాద‌క‌ద్రవ్యాల క్యాంపెయిన్ కోసం ఇటీవ‌ల ప్రియ కొచ్చి నుంచి త్రివేండ్ర‌మ్ కు విమానంలో వెళ్లింది. ప్రియ‌ విమానం ఎక్క‌డం అదే తొలిసారి. స్నేహితులతో క‌లిసి ఎంజాయ్ చేయ‌డాన్ని ఇష్ట‌ప‌డే ప్రియ‌కు ఇప్పుడా అవ‌కాశం లేకుండా పోయింది. అందుకే ఆమె త‌ల్లిదండ్రులు ప్రియ‌ను స్వేచ్ఛ కోల్పోయావ్ అంటుంటారు.

మోడ‌ల్ లా ఉన్నావు అన్న అంకుల్ మాట‌లు బుర్ర‌లో పాతుకుపోవ‌డంతో మోడ‌లింగ్ రంగంలోకి, అక్క‌డి నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాల‌ని ప్రియ నిర్ణ‌యించుకుంది. ఒరు అదార్ ల‌వ్ ఆడిష‌న్స్ కు వెళ్ల‌గా..కంగారుతో ఆడిష‌న్స్ సరిగ్గా ఇవ్వ‌లేక‌పోయింది. దీంతో ఆమెకు సినిమాలో ఓ చిన్న పాత్ర మాత్ర‌మే ద‌క్కింది. కానీ ఓ పాట‌లో ప‌లికించి హావ‌భావాలు…ఐదుగురు హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఎంపిక‌య్యేందుకు ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఆ త‌ర్వాత చిత్ర‌యూనిట్ యూట్యూబ్ లో విడుద‌ల చేసిన ఓ చిన్న వీడియో ప్రియా ప్ర‌కాశ్ జీవితాన్నే మార్చేసింది.