Movies

బాలనటిగా అందరిని అలరించిన ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సినీ పరిశ్రమలో ఎంతో మంది నటులు బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ లేదా హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం సహజమే. ఆలా కొంత మంది సక్సెస్ అయ్యారు. మరి కొంత మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు చెప్పబోయే బాల నటి చిన్నతనంలోనే తన నటనతో నేషనల్ అవార్డు అందుకుంది. ఆమె ఎవరో కాదు. మనఅందరికి తెలిసిన కుట్టి పద్మిని. ఆమె 1996 నుంచి తెలుసు సినిమాలకు దూరం అయింది.

ఆమె చిన్నతనంలో బాలనటిగా రజని,కమల్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె నటన చూసి అందరూ పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ అవ్వటం ఖాయమని అనుకున్నారు. కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి.

కుట్టి పద్మిని లేత మనసులు సినిమాలో డ్యూయల్ రోల్ పోషించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. కానీ పెద్దయ్యాక పెద్దగా హీరోయిన్ అవకాశాలు రాలేదు. అయితే సైడ్ క్యారెక్టర్స్ రావడం తో సినిమాలపై దృష్టి పెద్దగా పెట్టలేదు.

అప్పుడు ఆమె దృష్టిని టివి రంగం వైపుకు మళ్లించి ఎన్నో విజయవంతమైన సీరియల్స్ ని నిర్మించింది. అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఆమె నటించిన కొన్ని తమిళ సీరియల్స్ తెలుగులోకి డబ్ అయ్యాయి.

ఆలా తెలుగువారికి కూడా టచ్ లోనే ఉంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా టెలివిజన్ రంగంలో మంచి సక్సెస్ ఫుల్ నిర్మాతగా మరియు నటిగా మంచి పేరు తెచ్చుకుంది.