అంబానీ కొడుకు కారులో గడియారం ధర ఎంతో తెలిస్తే షాక్…మరి కారు ధర?!!

ఇండియాలో నెంబర్ వన్ కుబేరుడు ఎవరు అంటే టక్కున ముఖేష్ అంబానీ అని చెబుతారు. ఈ రిలయన్స్ దిగ్గజం ఆస్తి విలువ లక్ష కోట్లు దాటి సంవత్సరాలు గడుస్తోంది. మనదేశంలో మోస్ట్ రిచ్ పర్సన్ గా పేరుగాంచిన ముఖేష్ అంబానీ నివాసం గానీ, ఆయన లావిష్ లైఫ్ స్టయిల్ గానీ ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఆయన తనయులు ఆకాశ్, అనంత్ కూడా తండ్రికి తగ్గ వాళ్లే. ఎక్కడా ఖర్చుకు వెనుకాడరు. తండ్రిలాగే వీళ్లు కూడా కార్లంటే ఎంతో మోజు ప్రదర్శిస్తారు. లేటెస్ట్ గా ఆకాశ్ అంబానీ కొన్న కారు హాట్ టాపిక్ గా మారింది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెంట్లీ సంస్థ తయారుచేసిన బెంటేగా మోడల్ కారును ఆకాశ్ కొనుగోలు చేశాడు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ.3.85 కోట్లు అని చెప్పుకుంటున్నారు. దీంట్లో అమర్చిన గడియారం ధరే కోటి 95 లక్షలు అంటే కారు ఏ రేంజ్ లో ఉంటుందో చూసుకోండి.

లగ్జరీ కోరుకునేవాళ్లకి బెంట్లీ బ్రాండ్ ను మించింది లేదని చెబతారు. మిగతా లగ్జరీ కార్లకు బెంట్లీ కార్యకు తేడా ఏంటంటే అందులో ఉపయోగించే గడియారమే. దీన్ని బ్రీట్లింగ్ ముల్లినర్ టర్బలియన్ గా పిలుస్తారు. ఈ కారును తమ స్థాయికి దర్పణంగా భావించిన ఆకాశ్ వెంటనే కొనేశాడట. అల్ట్రా మోడ్రన్ ఫీచర్లున్న బెంట్లీ బెంటేగా కారు వరల్డ్ ఫేమస్ ఎస్ యూవీల్లో ఒకటిగా టాప్ లెవల్లో ఉంది.