అనసూయ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే నోరు వెళ్లబెడతారు

బుల్లితెర యాంకర్స్ లో అద్భుతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. ఒక పక్క టీవీ షోలలో యాంకర్ గా మరో పక్క సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. అనసూయ చేస్తున్న షో లు TRP రేటింగ్స్ ఎక్కువగా ఉండటం మరియు ఆమె నటించిన సినిమాలు కూడా హిట్ కావటంతో క్రేజ్ ఉండగానే క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన పారితోషికాన్ని ఒక్కసారిగా మూడింతలు పెంచేసింది ఈ భామ.

అనసూయ మొదటగా ఒక ఛానల్ లో యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ షో ద్వారా అనసూయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవటంతో దాదాపుగా అన్ని ఛానల్స్ లోను యాంకర్ గా చాలా బిజీగా ఉంది.

అంతేకాక సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలను ఎంచుకొని సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే ఆమె మంచి పొజిషన్ కి చేరుకుంది. ఇలాంటి అదృష్టం ఏ యాంకర్ కి రాలేదంటే అతిశయోక్తి కాదేమో.

ఆమె హవా ఇలా ఉండటంతో ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వటానికి నిర్మాతలు కానీ టివి షో ల యాజమాన్యం కానీ వెనకడుగు వేయటం లేదు. ఆమె క్రేజ్ ఆలా ఉంది మరి. ఒక వైపు బుల్లితెర మరోవైపు సినిమా రంగంలోనూ తన స్టామినా ఏమిటో చూపుతుంది.