Movies

అలా ఉండే ఈ నటుడు… ఎందుకు ఇలా అయ్యాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సినీ పరిశ్రమలో స్టంట్ మ్యాన్ లకు ప్రతి క్షణం జీవన్మరణ పోరాటమే.. ఎంతో రిస్క్ తీసుకుని పోరాట సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వందల అడుగుల ఎత్తు నుంచి దూకడం, మంటల్లోకి జంప్ చేయడం, ప్రమాదకరమైన రీతిలో బైక్ రైడింగ్ వంటి విన్యాసాలు చేయాలి. కానీ స్టంట్ మ్యాన్ లు చేసే ప్రతి షాట్ వెనుక మృత్యువు దోబూచులాడుతూనే ఉంటుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సుపరిచితుడైన నటుడు రాజేంద్రన్ కెరీర్్ ను ఓ ప్రమాదం ఎలా మార్చేసిందో చూడండి! రాజేంద్రన్ కెరీర్ మొదట్లో ఓ స్టంట్ మ్యాన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 500 సినిమాలకు స్టంట్స్ చేశాడు.

అయితే ఓ మలయాళ మూవీ కోసం బైక్ పై స్టంట్ చేస్తుండగా సీన్ డిమాండ్ చేసిన మేరకు అతడిపై నీళ్లు పోశారు. కానీ ఆ నీటిలో ఏవో ప్రమాదకరమైన కెమికల్స్ కలవడంతో రాజేంద్రన్ కు తీవ్రస్థాయిలో స్కిన్ ఎలర్జీ వచ్చింది. దాని ఫలితమే శరీరంపై ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయాయి. అందుకే ఇప్పటి సినిమాల్లో రాజేంద్రన్ ను చూస్తే ఇట్టే గుర్తుపట్టేయొచ్చు.

Actor Rajendran

కనీసం కనుబొమ్మలపై కూడా వెంట్రుకలు లేకుండా నునుపుగా కనిపిస్తుంటాడు. అయితే, స్టంట్ మ్యాన్ గా కొంతమందికే తెలిసిన రాజేంద్రన్ మారిన తన శరీరం కారణంగా నటుడిగా ఎన్నో చాన్సులు దక్కించుకోగలిగాడు. తెలుగులో గుడుంబా శంకర్, ఆప్తుడు, శ్రీ వంటి సినిమాల్లో నటించాడు. రీసెంట్ గా వచ్చిన ఛలో మూవీలో సీనియర్ ముత్తుగా అందరినీ అలరించాడు.